Andhra Pradesh: టీడీపీ దుష్ట సంప్రదాయానికి తగిన గుణపాఠం చెబుతాం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

|

Jun 10, 2022 | 2:44 PM

ప్రతిపక్ష తెలుగుదేశం(TDP) పార్టీ అసభ్య పదజాలం వాడటాన్ని మానుకోవాలని వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని అసభ్య పదజాలాలతో తిట్టడం, అవమానకర రీతిలో మాట్లాడటం వారికి ఒక...

Andhra Pradesh: టీడీపీ దుష్ట సంప్రదాయానికి తగిన గుణపాఠం చెబుతాం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్
Vijayasaireddy
Follow us on

ప్రతిపక్ష తెలుగుదేశం(TDP) పార్టీ అసభ్య పదజాలం వాడటాన్ని మానుకోవాలని వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని అసభ్య పదజాలాలతో తిట్టడం, అవమానకర రీతిలో మాట్లాడటం వారికి ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు. పదో తరగతి ఫలితాలపై పిల్లల తల్లిదండ్రులు, పార్టీ నాయకులతో జూమ్‌ మీటింగ్ పెట్టిన లోకేశ్ పిల్లలకు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అందుకే తమ పార్టీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎంటర్‌ అయ్యారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ కార్యాలయాన్ని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ప్రారంభించారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని ఆపకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల్లో పాస్‌ శాతం తగ్గడానికి కరోనానే కారణమన్న విజయసాయి.. దాన్ని కూడా రాజకీయం చేసి, ముఖ్యమంత్రిని దూషించడం చంద్రబాబుకే(Chandrababu) చెల్లిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలే గానీ, పిల్లల్న రెచ్చగొట్టే పనులు చేయకూడదని హితవు పలికారు. మీరు ఒకటి అంటే మేము పది అంటాం. ఇప్పటికైనా విధివిధానాలు మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

నారా లోకేశ్ నిన్న చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని విజయసాయి అన్నారు. చర్చించేందుకు తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని, మీరు సిద్ధంగా ఉన్నారని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయన్న విశ్వాసం మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడాన్ని బట్టే తమకు అర్థమయిందని, రెఫరెండం అంటే అర్థం తెలియని వారు కూడా రెఫరెండం అడుగుతున్నారని మండిపడ్డారు. నిజంగా రెఫరెండం కావాలనుకుంటుంటే ఆత్మకూరులో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

మంగళగిరిలో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి, అన్న క్యాంటిన్ పేరుతో రాజకీయం చేయడం తగదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే కేంద్ర పన్నుల రూపేణా, రాష్ట్రానికి రావాల్సిన 41 శాతమే వాటా ఇచ్చారా… అదనంగా ఏమైనా ఇచ్చారా..? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెరవేర్చింది. వాటి గురించి ఎందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వైజాగ్- చెన్నై కారిడార్, స్పెషల్ క్యాటగిరీ స్టేటస్, పోలవరం నిధులు ఇవేవీ ఇవ్వలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తలు, నాయకుల కృషి వల్లే. కార్యకర్తల సేవలు ఏరోజుకీ మరచిపోం. రాబోయే రెండేళ్లలోనూ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.

ఇవి కూడా చదవండి

             – విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి