Andhra Pradesh: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలి.. తిరుపతిలో భారీ ర్యాలీ

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్న వేళ.. వికేంద్రీకరణకు మద్దతుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణంలో..

Andhra Pradesh: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలి.. తిరుపతిలో భారీ ర్యాలీ
Rally In Tirupati Sipport on Three Capitals
Follow us
Amarnadh Daneti

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 29, 2022 | 2:37 PM

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్న వేళ.. వికేంద్రీకరణకు మద్దతుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణంలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు పలు ప్రజాసంఘాలు ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వమించిన విషయం తెలిసిందే. తాజాగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని.. రాయలసీమ హక్కులు కాపాడాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు.

రాయలసీమకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చన్నారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే అని​ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీదని ఆరోపించారు. తమ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నం చేస్తోందన్నారు.

తెలుగుదేశం పార్టీ అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన అనేకమంది ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..