AP Weather: వచ్చే 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. మినుములూరులో 12, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటుకులు క్యూ కడుతున్నారు.
బంగాళాఖాతము మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. దీంతో బెంగాల్, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్ కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల ప్రభావముతో అక్టోబర్ 29వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అంతేగాక నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంకపై గల వాయుగుండం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈరోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-—-
ఈరోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ :- —–
ఈరోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..