Tirumala Laddu: లడ్డు వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన వైసీపీ.. కీలక నిర్ణయం

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిందా..! జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీకి వాడారా..? అన్న అనుమానాలు వ్యక్తవముతున్నాయి. కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ వార్తలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ...

Tirumala Laddu: లడ్డు వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన వైసీపీ.. కీలక నిర్ణయం
Tirumala Laddu
Follow us

|

Updated on: Sep 24, 2024 | 1:43 PM

తిరుమల లడ్డు వ్యవహారం పొలిటికల్‌గా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వైసీపీ హయాంలో లడ్డు తయారీలో జంతువలు మాంసంతో తయారు చేసిన నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పుడీ టాపిక్‌ చర్యనీయాంశంగా మారింది. జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిందా..! జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీకి వాడారా..? అన్న అనుమానాలు వ్యక్తవముతున్నాయి. కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ వార్తలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ నుంచి వస్తుంటే.. ఇది తమను టార్గెట్ చేసే కుట్ర అని YCP భగ్గుమంటోంది. దీంతో ఈ వ్యవహారపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తమపై జరుగుతోన్న ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది.

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. ఈ విషయమై లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా, విచారణ జరిపించాలంటూ హైకోర్టును వైసీపీని కోరింది. వచ్చే బుధవారం పిటిషన్‌ను విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇక తాజాగా చంద్రబాబు చేసిన ఆరోపణలతో లడ్డు పవిత్రతపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలపై TTD మాజీ ఛైర్మన్లు YV సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు.

కాగా తిరుమల లడ్డు వివాదంపై టీడీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడనున్నారు. కాసేపట్లో రమణ దీక్షితులు మీడియా ముందుకు రానున్నార. లడ్డు వ్యవహారంపై జరుగుతోన్న ప్రచారంపై రమణ దీక్షితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో రమణదీక్షితులు ఏం మాట్లాడనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..