AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: సామాన్యులతో వరుస భేటీలు.. జగన్ కీలక నిర్ణయం.. ఇకపై..

ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీ పునరుజ్జీవంపై దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను, అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారు. ఇది పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

YS Jagan: సామాన్యులతో వరుస భేటీలు.. జగన్ కీలక నిర్ణయం.. ఇకపై..
Jagan Special Focus On Cadre
S Haseena
| Edited By: Krishna S|

Updated on: Nov 13, 2025 | 1:34 PM

Share

ఏపీలో వైసీపీ ఓటమి తరువాత పార్టీలో నెలకొన్న పరిణామాలను చక్కబెడుతున్న జగన్ మోహన్ రెడ్డి.. సమయం దొరికినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కూడా భేటీఅవుతున్నారు. ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఓటమి తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గాల ఇంచార్జీలను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి పునర్వైభవం వచ్చేలా వార్డు , గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాల వారిగా నూతన నియామకాలు చేపట్టారు. ఇక వాటితో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు సైతం అధ్యక్షులను నియమించి ఆయా విభాగాల కమిటీలతో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు నాయకులతో భేటీలు సమావేశాలు నిర్వహించిన జగన్ .. ఇప్పుడు పూర్తి సమయం ప్రజలకు, కార్యకర్తలకు ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్ తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రజలతో కలిసి వారితో ప్రత్యేకంగా చర్చిస్తూ వారి విజ్ఞప్తులను, అభిప్రాయాలను, సలహాలను, సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామనే హామీలు ఇచ్చేస్తున్నారు.

గత కొంత కాలంగా కార్యకర్తలతో జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడం లేదని కార్యకర్తలతో కలిసే అవకాశం ఇవ్వడం లేదననే విమర్శలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వ బాధితులు ఎవరైనా ఉంటే వారిని పరమర్శించడంతో పాటు వారికి అవసరం అయితే పార్టీ పరంగా అండగా ఉంటాం అనే భరోసా ఇస్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ఇలా ప్రజలతో కలిసిపోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..