AP Bandh: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల

|

Oct 20, 2021 | 11:52 AM

Yanamala Rama Krishnudu: రాజకీయాల్లో అగ్గి రాజుతుందంటే అది ఏపీ రాష్ట్రమేనని చెప్పాలి. ప్రతి రోజు ఏదో ఒక మూలన జరిగిగే ఘర్షణల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా..

AP Bandh: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసాలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల
Yanamala Rama Krishnudu
Follow us on

Yanamala Rama Krishnudu: రాజకీయాల్లో అగ్గి రాజుతుందంటే అది ఏపీ రాష్ట్రమేనని చెప్పాలి. ప్రతి రోజు ఏదో ఒక మూలన జరిగిగే ఘర్షణల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటుంది. ఇక టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజుకుంది. ఇందుకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. బంద్‌ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. బస్సులు తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసం జరుగుతుందని ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం దారుణానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలు – పోలీసుల మధ్య పెనుగులాట

దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు. నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. బంద్‌ సందర్భంగా నిరసనకు దిగుతున్న టీడీపీ నేతలు పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది.

వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: టీడీపీ

టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Bandh Live: ఏపీలో టీడీపీ బంద్‌.. నేతల నిరసన.. ఉద్రిక్తత వాతావరణం.. టీడీపీ-పోలీసుల మధ్య తోపులాట