AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన ఘనత సాధించిన కడప జిల్లా కేసీ కెనాల్.. ఏపీలోని మూడు నీటి ప్రాజెక్ట్‌లకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు..

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నీటి ప్రాజెక్ట్‌లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంతరించుకున్నాయి. కేసీ కాలువ, కంబం చెరువు, పోరు మామిళ్ల చెరువులకు....

అరుదైన ఘనత సాధించిన కడప జిల్లా కేసీ కెనాల్.. ఏపీలోని మూడు నీటి ప్రాజెక్ట్‌లకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు..
uppula Raju
|

Updated on: Nov 30, 2020 | 4:12 PM

Share

Casey Canal kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నీటి ప్రాజెక్ట్‌లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంతరించుకున్నాయి. కేసీ కాలువ, కంబం చెరువు, పోరు మామిళ్ల చెరువులకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ గుర్తింపు లభించింది. ఇండియాలో మొత్తం నాలుగు ప్రాజెక్ట్‌లు ఎంపిక కాగా అందులో ఏపీకి చెందినవి మూడు ఉండటం విశేషం. మరొకటి మహారాష్ట్రకు చెందిన ధామాపూర్ చెరువుగా గుర్తించారు.

కేసీ కాలువను కర్నూల్, కడప మధ్య బ్రిటీష్ వారు తవ్వించారు. తుంగభద్రపై కర్నూల్ జిల్లాలో నిర్మించిన సుంకేశుల బ్యారేజీ నుంచి కడప జిల్లా కృష్ణ రాజపురం వరకు ఈ కాలువను నిర్మించారు. బ్రిటీష్ వారు ఈ కాలువను సరుకు రవాణా కోసం తవ్వించారు. రాను రాను ఇది సాగునీటి ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతుంది. తుంగభద్ర, పెన్నాలను కలిపేలా 305 కిలో మీటర్ల దూరం ఈ కాలువ విస్తరించి ఉంది. ఇక ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ చెరువు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద చెరువుగా గుర్తింపు సాధించింది. దీని కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మరొకటి కడప జిల్లాలోని పోరు మామిళ్లలోని చెరువు. దీనికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇది కూడా వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నారు.