AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ.. 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. మెయిన్ గేటు వద్ద చంద్రబాబు ధర్నా

వరద సాయంపై చర్చ అంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో ఒక్కరోజుపాటు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం...

హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ.. 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. మెయిన్ గేటు వద్ద చంద్రబాబు ధర్నా
Rajesh Sharma
|

Updated on: Nov 30, 2020 | 2:57 PM

Share

వరద సాయంపై చర్చ అంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో ఒక్కరోజుపాటు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగించిన టీడీపీ సభ్యులను స్పీకర్‌ అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, భవాని, గద్దె రామ్మోహన్, రామరాజు, అచ్చెన్నాయుడు, బీ.అశోక్‌, పయ్యావుల శవ్‌, వెలగపూడి రామకృష్ణ బాబు సస్పెండ్‌ అయ్యారు.

అంతకు ముందు అసెంబ్లీలో పోడియం ముందు నేలపై కూర్చుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరసన కొనసాగించారు. వరద ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవడటంలో జగన్ సర్కార్ విఫలమైందని టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే, సీఎం జగన్‌ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం.. చంద్రబాబు ఎలా మాట్లాడతారంటూ అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎలా అడ్డుకుంటారని చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. అధికార పక్షం తీరును నిరసిస్తూ పోడియం దగ్గర కింద కూర్చుని చంద్రబాబు నిరసన తెలిపారు. ఆయనతోపాటు ప్రతిపక్ష సభ్యులూ అక్కడే బైఠాయించారు. రౌడీయిజం చేసి మళ్లీ అన్యాయం జరిగిందంటారా అంటూ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, డిసెంబర్‌ 15లోపు ఎన్యుమరేషన్‌ పూర్తి చేస్తామని, నెలాఖరుకు సాయం అందిస్తామని చెప్పారు.

సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు చేసిన ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీకే చెందిన పయ్యావుల కేశవ్‌.. రామానాయుడు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. మీ పార్టీకి చెందిన సభ్యుడిని మాట్లాడకుండా అడ్డుకోవడం సబబు కాదని కేశవ్‌కు స్పీకర్‌నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. అయినా టీడీపీ సభ్యులు శాంతించకుండా స్పీకర్ పోడియం ముందు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో సహా టీడీపీ సభ్యులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. దాంతో చంద్రబాబు సహా పదమూడు మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అయినా కూడా సభలోనే నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ సభ్యులను మార్షల్స్ బయటికి తరలించగా.. చంద్రబాబు అసెంబ్లీ మెయిన్ గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు.