Andhra Pradesh: బ్రోతల్ హౌస్‌పై పోలీసుల దాడులు.. మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడు అరెస్టు
తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి స్టన్ అయ్యారు. ఆ గృహం నిర్వాహకుల్లో ఓ మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడు ఉండటం సంచలనంగా మారింది.
కుమార్తె కష్టపడి చదివి జాబ్ కొట్టింది. అది కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. ప్రజంట్ ఎస్సైగా విధులు నిర్వరిస్తోంది. అయితే ఆ మహిళా ఎస్సై తల్లి, సోదరుడు మాత్రం వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు పక్కా సమాచారంతో ఓ బ్రోతల్ హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ గలీజ్ దందా నడిపిస్తున్న మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడుతో పాటు ఓ విటుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు బాధిత యువతులను హోమ్‌కు తరలించారు.
ఆ మహిళా ఎస్‌ఐకి సంవత్సరం కిందట మ్యారేజ్ అవ్వడంతో ఆమె భర్తతో కలిసి మరో చోట ఉంటుంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటున్నారు. వారు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు అకస్మిక దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తమ కుమార్తె ఎస్సై ఏం కాదు అనుకున్నారో.. లేక ఈ దందాలో ఆరితేరారో తెలియదు కానీ.. ఈ పరువు తక్కువ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. కేసును పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..