Razampet: మేనకోడలి పెళ్లికి వచ్చి హోటల్లో విడిది ఉన్న మహిళ.. తెల్లారి రెడీ అవుతుండగా…
అన్న కూతురు పెళ్లి... అంగరంగ వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. పెళ్లి ఇంటికి బంధువులొచేస్తున్నారు... ఎవరి పనుల్లో వారు నిమగ్నమవగా పేరంటానికి ముస్తాబు అవుతున్నారు మహిళలు.. అలంకరిచుకుందామని ఆభరణాలుంచిన బ్యాగు చూడగా అందులో ఉంచిన బంగారు మొత్తం మాయం. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఏపీలోని రాజంపేట పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్న జోగి సుదర్శన్ రెడ్డి కుమార్తె నందిని వివాహం ఏప్రిల్ నెల 28వ తేదీ రాజంపేటలో జరిగింది. సుదర్శన్ రెడ్డి తిరుపతిలో నివాసం ఉంటున్న తన సోదరి నాగమణిని వివాహానికి ఆహ్వానించాడు. నాగమణి వివాహంలో పాల్గొనడానికి తన కుమార్తెతో పాటు రాజంపేటకు వచ్చింది. నాగమణి ఉండటానికి అన్న సుదర్శన్ రెడ్డి బయట రూములు కేటాయించారు. నాగమణితో పాటు పెళ్లికొచ్చిన ఇతర బంధువులు ఆ రూముల్లో విడిది చేశారు. నాగమణి మేనకోడలి పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయింది. ఉదయాన్నే పెళ్లి మండపం వద్దకు వెళ్లడానికి రెడీ అవుతున్న క్రమంలో ఆభరణాలు ధరించడానికి బ్యాగ్ తెరిచి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా. అందులో ఉంచిన 30 లక్షల విలువచేసే 343 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో నాగమణి అన్న సుదర్శన్ రెడ్డికి విషయం తెలిపి ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ చెక్ చేయించింది. ఏ విధమైన ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఆమె ఏప్రిల్ 29వ తేదీ రాజంపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదే విషయంపై బాధితులు రాజంపేట ఏఎస్పీ రామ్‌నాథ్ హెగ్డేని కలిసి విన్నవించకున్నారు. తమ ఆభరణాలు పోయిన రోజు తాము విడిది చేసిన గది పరిసర ప్రాంతాల్లోని రూములను అన్నిటినీ క్షుణ్ణంగా వెతికామని బాధితురాలు నాగమణి పోలీసులను కోరారు. ఆయా రూముల్లో సోదా చేసే క్రమంలో సమీప రూములో విడిది ఉన్న జోగి సుకన్య అనే మహిళ తన రూములో వెతకనివ్వకుండా తాళం వేసుకొని తమను అడ్డగించిందని ఏఎస్పీకి తెలిపారు. పెళ్లికి వచ్చిన.. వేదిక వద్దకు కూడా రాకుండా అర్ధాంతరంగా వెళ్లిపోవడంపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గత నెల 30వ తేదీ దాదాపు 19 మంది బంధువుల వేలిముద్రలను పోలీసులు సేకరించడం జరిగిందని.. అనంతరం కొందరు కువైట్‌కి వెళ్లిపోవడంపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని బాధితురాలు నాగమణి వివరించారు. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తమకు అనుమానం ఉన్న వారి వివరాలను పోలీసులకు అందించారు. ఇలా అన్న పెళ్లికొచ్చి ఆభరణాలు పోగొట్టుకొని ఆవేదన చెందుతుంది బాధితురాలు .. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి