Anantapur: కూల్‌గా కార్‌లో వచ్చారు.. ఆ తర్వాత.. సీసీ విజువల్స్ చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు
నైట్ టైంలో కూల్‌గా కారులో వచ్చారు. ఏదో పని మీద అనుకుంటే పొరపాటే.. వారు వచ్చింది దొంగతనానికి. అది కూడా బైక్ తస్కరించడానికి. అవును కారులో వచ్చి బైక్‌తో ఎస్కేప్ అయ్యారు. అనంతపురంలో ఈ ఘటన వెలుగచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి ..

వేసవికాలం వచ్చిదంటే చాలు దొంగతనాలు, చోరీలు విపరీతంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య ద్విచక్ర వాహనాల దొంగలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రేయి, పగలు అనే తేడా లేకుండా వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ బైక్ దొంగతనం జరిగింది. బైకు దొంగతనం ఎలా జరిగిందో?? సిసిటీవీ ఫుటేజ్ చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. కారులో వచ్చి మరీ చాకచాక్యంగా బైక్‌ను ఎత్తుకెళ్లారు. రెక్కి నిర్వహించి…. పార్కింగ్ చేసిన బైక్‌ల అర్ధరాత్రి దాటిన తర్వాత తస్కరిస్తున్నారు. బైకు దొంగతనాలు చేసేందుకు దుండగులు ఏకంగా కారు ఉపయోగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
బైక్ చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనంపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగరు ఎంత ముదుర్లు కాకపోతే .. కారులో వచ్చి మరీ బైక్ ఎత్తుకెళ్తారు చెప్పండి. ఇటీవల అనంతపురం జిల్లాలో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురవడం పోలీసులకు సవాల్‌గా మారింది. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చాలా ఈజీగా దొంగతనం చేస్తున్నారు దుండగులు. బైకు దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి