AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ‘నా ఫోటో ఏ పోలీస్ స్టేషన్‌కి అయినా పంపు.. వారికే దడ పుడుతుంది’.. కండక్టర్‌కు మహిళ వార్నింగ్

జగ్గయ్యపేట డిపో బస్సులో మహిళా ప్రయాణికురాలి హంగామా చేసింది విజయవాడ-పెనుగంచిప్రోలు రూట్‌లో బస్సులో ఆమె చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు డ్రైవర్, కండక్టర్ సూచనలను పట్టించుకోకుండా.. వారికే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Vijayawada: 'నా ఫోటో ఏ పోలీస్ స్టేషన్‌కి అయినా పంపు.. వారికే దడ పుడుతుంది'.. కండక్టర్‌కు మహిళ వార్నింగ్
Women Warning
Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 16, 2025 | 7:57 PM

Share

జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న బస్సులో మహిళా ప్రయాణికురాలు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయవాడ బస్టాండ్ నుంచి బయల్దేరిన బస్సులో పరిటాల గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కింది. ఫుట్ బోర్డుపై నిల్చొని ప్రయాణించడం ప్రమాదకరమని ప్రమాదవశాత్తూ పడిపోతావు లోపలికి వెళ్ళమ్మా అంటూ బస్సు డ్రైవర్ విజ్ఞప్తి చేశాడు. దీనితో డ్రైవర్‌, కండక్టర్‌పై చిందులు తొక్కింది సదరు మహిళా ప్రయాణికురాలలు.  బస్సులో ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా నానా రచ్చ చేసింది. సర్ది చెప్తున్న కండక్టర్‌కు ఓ రేంజ్‌లో దమ్కీ ఇచ్చింది.

నేను ఎవ్వరో తెలుసా.. నా ఫోటో తీసుకో.. దాన్ని విజయవాడతో పాటు చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి చూపించి నేను ఎవ్వరో అడుగు… నా ఫోటో చూడగానే పోలీసులకే దడ పుడుతుంది అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది. అయితే విధుల్లో ఉన్న కండక్టర్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఆయన సదరు మహిళా ప్రయాణికురాలిని బ్రతిమాలి విజ్ఞప్తి చేయడం కనిపించింది.  ఆమె మాట వినకపోవడంతో….. నేరుగా కంచికచర్ల పోలీసు స్టేషన్‌కు బస్సును తీసుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు.  గొడవ చేస్తున్న సమయంలో  తోటి ప్రయాణికులకు సర్ది చెప్తున్నా వారిపై కస్సుబుస్సులాడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..