కడుపులో కవలలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వెంటాడిన విషాదం… ఆ కుటుంబంలో తీవ్ర దు:ఖం

|

Sep 28, 2021 | 6:03 PM

విధి మనుషుల జీవితాలతో ఎలాంటి ఆడుతుందో తెలియజెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. ఆమె కడుపులో కవలలు ఉన్నారని తెలిసి ఎంతో ఆనందపడింది. కానీ...

కడుపులో కవలలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వెంటాడిన విషాదం... ఆ కుటుంబంలో తీవ్ర దు:ఖం
Women Death
Follow us on

విధి మనుషుల జీవితాలతో ఎలాంటి ఆడుతుందో తెలియజెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. ఆమె కడుపులో కవలలు ఉన్నారని తెలిసి ఎంతో ఆనందపడింది. కానీ ఊహించని విషాదం ఆమెను వెంటాడుతుందని తెలియదు. ఈ క్రమంలోనే ప్రసవం సమయంలో విషాదం జరిగింది.  ఓ బిడ్డకు జన్మనిచ్చి.. మరో బిడ్డను ఈ భూమ్మీదకు తీసుకురాకుండానే తనువు చాలించింది. మనుసులను కదిలించే ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మారేడుమిల్లి మండలం దేవరపల్లికి చెందిన గిరిజన మహిళ కోండ్ల సరస్వతికి ఆదివారం రాత్రి పురిటినొప్పులు రాగా ఇంటివద్దే కాన్పునకు సిద్దం చేశారు. అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డ ప్రసవానికి ఇబ్బందులు ఎదురవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు మారేడుమిల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితిని సమీక్షించి.. మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కు పంపించారు. మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాజమహేంద్రవరం జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కడుపులో బిడ్డతో సహా సరస్వతి ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని బంధువులు ఆరోపించారు.

దీనిపై హాస్పిటల్  గైనకాలజిస్టు డాక్టర్‌ ప్రమీలను వివరణ కోరగా ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారని, రక్తహీనత సమస్యతోనూ బాధపడుతోందని తెలిపారు. ఇంటిదగ్గర పుట్టిన బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.

Also Read: రాగల 3 రోజుల్లో ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ 2 జిల్లాలో మాత్రం భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు.. ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి అతను.. భర్త వేధింపులకు ఆమె బలి..