ఆమె వలపు ఖరీదు నిండు ప్రాణం.. అనాధలుగా మారిన చిన్నారులు.. వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 05, 2023 | 11:17 AM

Eluru District: ఓ పక్క తండ్రి మరణం, మరోపక్క తల్లినీ పోలీసులు తీసుకువెళ్లడంతో ఆ చిన్నారులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లి పోతున్నారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి కి చెందిన కురిపాటి చంద్రశేఖర్(39) కు 2013లో అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి అనే మహిళతో..

ఆమె వలపు ఖరీదు నిండు ప్రాణం.. అనాధలుగా మారిన చిన్నారులు.. వివరాలివే..
Representative Image
Follow us on

ఏలూరు, ఆగస్టు 5: పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతున్న పచ్చని సంసారంలో సోషల్ మీడియా నిప్పులు కురిపించింది. చివరకు కట్టుకున్న భార్యే వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసేలా చేసింది. ఓ పక్క తండ్రి మరణం, మరోపక్క తల్లినీ పోలీసులు తీసుకువెళ్లడంతో ఆ చిన్నారులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లి పోతున్నారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి కి చెందిన కురిపాటి చంద్రశేఖర్(39) కు 2013లో అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి అనే మహిళతో వివాహమైంది. వారికి తొమ్మిదేళ్ల నిత్యశ్రీ, ఐదేళ్ల సిద్ధార్థ సంతానం. కొంతకాలం క్రితం బ్రతుకు తెరువు కోసం చంద్రశేఖర్ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వచ్చాడు. ఇక్కడ ఉన్న ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక టూరింగ్ పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని భార్య బిడ్డలతో జీవనం సాగిస్తున్నారు.

చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం వారి పండంటి ఆ కాపురంలో సోషల్ మీడియా కాల యముడిలా ప్రవేశించింది. చంద్రశేఖర్ భార్య భువనేశ్వర్ కి ఇన్ స్ట్రా గ్రాం లో తాడేపల్లిగూడెం కు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే భార్య భువనేశ్వరి వ్యవహారంపై చంద్రశేఖర్ కు అనుమానం వచ్చింది. దీంతో వారి వివాహ బంధంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు రాను రాను పెరిగి పెద్దవయ్యాయి. తన ప్రియుడిని కలవడానికి తన భర్త అడ్డంగా ఉన్నాడని అతనిపై కక్ష పెంచుకుంది భువనేశ్వరి . దీంతో చంద్రశేఖర్ ను ఎలా అయినా మట్టు పెట్టాలని పథకం రచించింది. ఎప్పటిలాగే
ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ భోజనం చేసి పడుకున్నాడు.

అయితే ఇదే అదునుగా భావించిన భువనేశ్వరి తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న చంద్రశేఖర్ మెడ మీద బలంగా కత్తితో పొడిచారు. దీంతో రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకుంటూ చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రతి చెందాడు. అనంతరం భువనేశ్వరి ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తెల్లారి నిద్రలేచిన పిల్లలు ఎంతకీ తన తండ్రి మాట్లాడకపోవడంతో ఇంటి యజమాని వద్దకు వెళ్లి చెప్పారు. చంద్రశేఖర్ ను చూసిన ఇంటి యజమాని అతను హత్యకు గురైనట్టు అనుమానించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు ప్రారంభించారు.
కట్టు కథతో పోలీసులను ఏమార్చి చంద్రశేఖర్ విగత జీవిగా పడి ఉంటే ఆయన భార్యలో స్థానికులకు ఏమాత్రం బాధ కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

ఇంకా తన భర్తను ఎవరో చంపి ఇంట్లో బంగారు వస్తువులు అపహరించుకుపోయారని నమ్మించే ప్రయత్నం ఆమె చేసింది. అయితే అప్పటికే స్థానికులను సైతం విచారించిన పోలీసులు భువనేశ్వరి అబద్దం చెబుతున్నట్లు గ్రహించారు. ఆమెను స్టేషన్కు తీసుకెళ్లి తమదైన పద్ధతిలో విచారణ చేశారు. ఆ విచారణలో తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు భువనేశ్వరి ఒప్పుకుంది. ఈ హత్య వీరిద్దరే చేశారా లేక ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే విషయాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఓ పక్క తండ్రి హత్య, మరోపక్క తల్లిని పోలీసులు తీసుకువెళ్లడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ చిన్నారులు తల్లడిల్లి పోతున్నారు. ఆ చిన్నారులను చూసిన కొందరు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..