Andhra Pradesh: డబ్బు, బంగారం కోసం స్నేహితుడ్ని హత్య చేసిన భార్య,భర్తలు.. ఒక రోజు మొత్తం శవంతోనే..

డబ్బు,బంగారం కోసం తోటి స్నేహితుడ్ని భార్యతో కలిసి హత్య చేసి బాడీ దొరక్కుండా మాయం చేసారు. మొదట మిస్సింగ్ కేస్ అనుకున్న పోలీసులకు విచారణ చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుల్ గా మద్యం పోసి కరెంట్ వైర్ తో హత్య చేసి మృతదేహాన్ని లేకుండా చేశారు. కృష్ణ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోసుకుంది.

Andhra Pradesh: డబ్బు, బంగారం కోసం స్నేహితుడ్ని హత్య చేసిన భార్య,భర్తలు.. ఒక రోజు మొత్తం శవంతోనే..
Death

Edited By:

Updated on: Aug 09, 2023 | 4:36 PM

డబ్బు,బంగారం కోసం తోటి స్నేహితుడ్ని భార్యతో కలిసి హత్య చేసి బాడీ దొరక్కుండా మాయం చేసారు. మొదట మిస్సింగ్ కేస్ అనుకున్న పోలీసులకు విచారణ చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుల్ గా మద్యం పోసి కరెంట్ వైర్ తో హత్య చేసి మృతదేహాన్ని లేకుండా చేశారు. కృష్ణ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింగ్ నగర్ కు చెందిన పురుషోత్తంకు 11 ఏళ్ళుగా మొహిందర్ అనే మిత్రుడు ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొహిందర్ కు అప్పుడప్పడూ డబ్బు సాయం చేస్తుండే వాడు పురుషోత్తమ్ . పురుషోత్తమ్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండటం ఒంటిపై బంగారం ఉండటంతో కన్నేసిన భార్య భర్తలు ఎలాగైనా వాటిని దొంగిలించాలనుకుని హత్య కు ప్లాన్ వేశారు.

గత నెల 31 న పురుషోత్తం ను ఇంటికి తీసుకుని వచ్చి ఫుల్‎గా మద్యం పోశారు. ఆ తర్వాత ఇంట్లో వున్న కరెంట్ వైర్ తో భర్త పీక బిగిస్తే భార్య శబ్దం చెయ్యకుండా కాళ్ళు పట్టుకుంది. దీంతో పురుషోత్తం ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో నిందితులు వెంటనే ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసి చేసి బాడీ పడేద్దాం అనుకుంటే చుట్టూ జనం ఉండటంతో ఒక రోజు మొత్తం ఏమాత్రం అనుమానం రాకుండా స్మెల్ రాకుండా ఫుల్ ఏసి వేసి బాడీని ఇంట్లోనే ఉంచారు. ఆ రోజు దొంగిలించిన బంగారాన్ని గుంటూరు తీసుకుని వెళ్లి అమ్మేశారు. వాటి నుంచి వచ్చిన 1 లక్ష 70 వేలతో కొద్దిగా అప్పులు తీర్చారు. రాత్రయ్యాక అద్దె కార్ తీసుకుని బాడీని ప్యాక్ చేసి మూడు ఏళ్ళ చిన్నారిని వెంటపెట్టుకుని రాజమండ్రి ధవేశ్వరం బ్రిడ్జి దగ్గర చీకటిగా వున్న ప్రదేశంలోకి వెళ్లారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్న చోట బాడీని పడేసారు. ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా బాడీని మాయం చేయగలిగారు కానీ పోలీసుల నుండి మాత్రం తప్పించుకోలేకపోయారు..

పురుషోత్తమ్ అన్న తమ్మడు తన బాబాయ్ కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు పురుషోత్తమ్ ఫోన్ మొహేందర్ ఇంటి వద్దే ఆఫ్ అవ్వటం ఆ తర్వాత ఎవ్వరికీ కాంటాక్ట్ లేకపోవటంతో అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే మొహిందర్ వద్దకు వెళ్లి తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు వ్యవహారం మొత్తం బయటపడింది. చివరికి భార్య భర్తలిద్దరని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..