పులివెందుల, ఆగస్టు 2: రాయలసీమ పర్యటనతో చంద్రబాబు ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ఓ వైపు టీడీపీ మరో వైపు వైసీపీ మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో పులివెందుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల సభ చూసిన తర్వాత అయినా తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు పులివెందుల సభలో ప్రసంగించారు. వై నాట్ పులింవెందుల అని చెప్పడానికే పులివెందుల వచ్చినట్టు మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు.
మరోవైపు పులివెందులలో సినిమా డైలాగులు కొట్టారు చంద్రబాబునాయుడు. వయసు కేవలం నెంబర్ మాత్రమే.. సింహం ఎప్పుడే సింహమే అంటూ డైలాగులు పేల్చారు. టీడీపీకి అడ్డుకోవడానికి కర్ర పట్టుకుంటే మేమూ ఎదొరొస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పులివెందుల వేదికగా.. ఏపీ రాజధానిపైనా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటూ మండిపడ్డారు. పులివెందుల ప్రజలు నాలుగు గంటల్లో వెళ్లి వచ్చేలా అమరావతి ఉంటే కాదని.. ఎక్కడో విశాఖ వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంటూ జనాలతో నినాదాలు చేయించారు.
కాగా.. చంద్రబాబు పులివెందుల పర్యటనకు ముందు టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల కార్‌ను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలను సముదాయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..