Viral Video: కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..

|

Dec 17, 2021 | 6:50 PM

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన తెల్లత్రాచు పాము హల్‌చల్‌ చేసింది. ముమ్మిడివరంలోని ఓ కొబ్బరి తోటలో ఈ తెల్ల త్రాచుపాము కలకలం రేపింది.

Viral Video: కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..
Snake Hulchul
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన తెల్లత్రాచు పాము హల్‌చల్‌ చేసింది. ముమ్మిడివరంలోని ఓ కొబ్బరి తోటలో ఈ తెల్ల త్రాచుపాము కలకలం రేపింది. కొబ్బరికాయల మధ్య దాగివున్న భారీ తెల్ల త్రాచుపాము బుసకొడుతూ.. స్థానికులు, కార్మికుల్ని హడలెత్తించింది. కొబ్బరి ఒలుపు కార్మికులు కొబ్బరి రాశి నాడెం వేస్తుండగా.. బుసలు కొడుతూ భారీ తెల్ల త్రాచు పాము కంటపడింది. దీంతో బెంబేలెత్తిపోయిన కార్మికులు యజమాని సమాచారం అందించారు. కొబ్బరి తోట యజమాని వెంటనే స్నేక్ క్యాచర్ వర్మ కు సమాచారం అందించారు.. కొబ్బరి రాశి లో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ.

 

 

వర్షాలు కురిసినప్పడు, వరద పోటెత్తినప్పుడు పాములు పుట్టలు,  బొరియల నుంచి బయటకు రావడం సర్వసాధారణం. ప్రజంట్ వర్షాలు కురుస్తుండటంతో.. పాములు తలదాచుకునేందుకు అడవుల్లో నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తాయి. ఈ క్రమంలో జనాల్ని చూసి పాములు, పాముల్ని చూసి.. జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే పాము కనిపించగానే దాన్ని చంపేయకుండా తమకు లేదా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాటికి కూడా అన్ని జీవుల్లానే భూమిపై సమానంగా బ్రతికే హక్కు ఉందని చెబుతున్నారు.

Also Read: Viral Video: ఈ పాముకు అందంతో పాటు.. సిగ్గు కూడా ఎక్కువేనట..!