AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone: అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమిటి? తుఫాన్లనీ ఒక్కచోటే ఎందుకు పుడుతున్నాయి?

తుఫాన్ల గురించి మనకు తెలుసు. వాటి బీభత్సం ఎలా ఉంటుందో కూడా చాలా సందర్భాల్లో చూశాం.. కానీ అవి ఎక్కడ? ఎలా ఏర్పడుతాయి? ఈ విషయం ఎప్పుడైనా గమనించారా? ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సుదీర్ఘమైన తూర్పు తీరంలో అల్పపీడనాలు మొదలై ఎక్కడో తుఫాన్ల రూపంలో తీరం దాటుతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది? తుఫాన్లనీ ఒక్కచోటే ఎందుకు పుడుతున్నాయి?

Cyclone: అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమిటి? తుఫాన్లనీ ఒక్కచోటే ఎందుకు పుడుతున్నాయి?
Low Pressure
Ram Naramaneni
|

Updated on: Nov 25, 2024 | 11:22 AM

Share

తుఫాన్లు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. వీపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కలిగిస్తాయి. తుఫాన్ల విధ్వంసం నుంచి కోలకోడానికి కొన్నిసార్లు ఏళ్లు పడుతుంది. అయితే ఈ తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి.. ఎలా ఏర్పడుతాయి? మనం తరుచుగా వినే అల్పపీడనం, వాయుగుండం అంటే ఏంటి లాంటి వివరాలు తెలుసుకుందామా…?

ఎక్కువ గాలులుంటే అధిక పీడనం.. తక్కువ గాలులుంటే అల్పపీడనం

ఎక్కువగా గాలులు ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు నిపుణులు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనంగా పరిగణిస్తారు. గాలుల కదలికలో మార్పులు జరగడం వల్లే ఈ రెండు పీడనాలు ఏర్పడతాయి. ఈ గాలిలొ కూడా రెండు రకాలు ఉంటాయి. అవి వేడి గాలి, చల్లని గాలి. ఈ గాలులు భూమ్మీద, సముద్రాల మీద వ్యాపించి ఉంటాయి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా భూ ఉపరితలంపై ఉంటుంది. సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్లగాలిలోని తేమ ఆవిరై.. గాలులు వేడెక్కి..తేలికగా మారి పైకి చేరుతాయి. గాల్లో ఉండే నీటి ఆవిరి కూడా పైకి చేరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా మారుతుంది. దీన్నే అల్పపీడనం అంటారు. అంటే గాలులు తక్కువ ఉన్న ప్రదేశమని అర్థం. ఈ క్రమంలో చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు వీస్తాయి. ఆ వీచే గాలులతో పాటు మేఘాలు కూడా పయనించి చల్లబడి వర్షాలు కురుస్తాయి.

అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండం

ఆ గాలుల మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటే.. అల్పపీడనం ఉన్న చోట గాలులన్నీ కలిసి ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. పైన ఉన్న మేఘాల నుంచి వర్షాలు కురుస్తాయి. మొత్తంగా అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా వృద్ధి చెందుతుంది.

నీటి ఆవిరిని తుఫాన్లు సంగ్రహిస్తాయి

సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు సంగ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి.. దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ట్రావెల్‌ చేస్తాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుఫాన్‌.. భూ వాతావరణంలోకి రావటాన్నే తీరాన్ని తాకటం అంటారు. తుఫాన్‌ భూ ఉపరితలాన్ని తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు విచ్ఛిన్నమై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరంపైకి గంటలకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగలవు.

తుఫాన్లు పుట్టేది అండమాన్‌ పరిసరాల్లో

దక్షిణ భారతదేశంలోని తూర్పు తీరం వరుస తుఫాన్లతో తల్లడిల్లుతూ ఉంటుంది. అక్టోబర్‌ వచ్చిందంటే చాలు తీర ప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఎంత పెద్ద వరద వచ్చి ముంచేస్తుందోనని భయపడుతూ ఉంటారు. ఇక ఏటా అక్టోబర్‌, డిసెంబర్‌ మధ్య చెన్నై నగరం కష్టాలు చెప్పనలవి కావు. తమిళనాడుని ఆనుకుని ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూస్తూనే ఉంటాం.. ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బంగ్లాదేశ్‌ వరకు అట్టుడికించే తుఫాన్లు పుట్టేది తమిళనాడు సమీపంలోని అండమాన్‌ పరిసరాల్లోనే.. అందుకు కారణం అక్కడి వాతావరణంలో ఉన్న పరిస్థితులే కారణమంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో దేశంలో కొనసాగే ఇంట్రా ట్రోపికల్‌ కన్వర్జెన్సీ జోన్‌ దక్షిణాది వైపు వచ్చేస్తుంది. దీంతో బంగాళాఖాతంలోని ఉత్తర ప్రాంతంలో వాతావరణం పొడిగా మారుతుంది. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా పయనించేటప్పుడు ఉత్తర ప్రాంతంలో జలాలు చల్లగా మారుతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..