AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..

పెళ్ళి మండపాల్లో చోరీలు కామనే.. అయినా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నగదు, నగలు అపహరించుకుని వెళ్ళే ముఠాల ఆగడాలు ఎక్కువయ్యాయి.. పెళ్ళిళ్ళలో ఎవరి హడావిడిలో వారుంటే దొంగలు మాత్రం అందినకాడికి దోచుకుని తట్టాబుట్టా సర్దేస్తున్నారు.. ఇలాంటిదే ఓ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది.

పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
Wedding
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 30, 2025 | 1:22 PM

Share

పెళ్ళి మండపాల్లో చోరీలు కామనే.. అయినా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నగదు, నగలు అపహరించుకుని వెళ్ళే ముఠాల ఆగడాలు ఎక్కువయ్యాయి.. పెళ్ళిళ్ళలో ఎవరి హడావిడిలో వారుంటే దొంగలు మాత్రం అందినకాడికి దోచుకుని తట్టాబుట్టా సర్దేస్తున్నారు.. ఇలాంటిదే ఓ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఒంగోలు శివారులో జరుగుతున్న ఓ పెళ్ళి వేడుకల్లో అతిధులుగా వచ్చిన ఇద్దరు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా వధువు గదిలోకి ప్రవేశించి 158 గ్రాముల బంగారు నగలు, లక్షన్నర రూపాయల నగదు ఎత్తుకెళ్ళారు. పనిలో పనిగా పెళ్ళికి వచ్చిన వారు జేబులు కూడా కత్తిరించారు. పెళ్ళి హడావిడిలో ముందు గుర్తించకపోయినా తీరా ముహూర్తం సమయానికి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే దొంగలు పెళ్ళి మండపం నుంచి ఉడాయించారు.

వివరాల ప్రకారం..

ఒంగోలు శివారులోని త్రోవగుంటలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్ళి హడావిడిలో బంధువులు మునిగిపోయారు. బసవన్నపాలెం గ్రామానికి చెందిన యువకుడికి, మైనంపాడుకు చెందిన యువతికి వివాహం జరుగుతోంది.. అంతా పెళ్ళి పనుల్లో నిమగ్నమై ఉన్నారు.. కాఫీలు తాగారా, టిఫినులు తిన్నారా… అంటూ ప్రతి పెళ్ళిళ్ళలో కనిపించే దృశ్యం ఇక్కడ కూడా కనిపించింది. పడుచులు అందంగా ముస్తాబై పెళ్ళి మండపంలో సందడి చేస్తున్నారు.. ఎవరి పనిలో వారు ఉండగా పిలవని పేరంటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కళ్యాణమండపంలో తచ్చాడుతూ కనిపించారు.. వధువు బంధువుల్లాగా వ్యవహరిస్తూ వధువుకు కేటాయించిన గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో గదంతా వెతికారు.. లక్కీగా వధువుకు అలంకరించేందుకు ఉంచిన 158 గ్రాముల బంగారు నగలు కనిపించాయి. అక్కడే మరో లక్షన్నర రూపాయల నగదు కూడా ఉంది. అంతే తమ పంట పండిందని గ్రహించిన ఆ ఇద్దరూ నగలు, నగదు తీసుకుని హడావిడిగా గదినుంచి బయటకు వచ్చారు.

ఆ క్రమంలో హడావిడిగా వధువు గదినుంచి బయటకు వస్తున్న ఈ ఇద్దరు దొంగలను ఓ మహిళ ఏంటి హడావిడిగా ఉన్నారని… ప్రశ్నించగా హిందీలో పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్ళిపోయారు.. ఆ తరువాత వధువు గదిలో నగలు కనిపించడం లేదన్న సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న పెళ్ళి పెద్దలు చోరీ జరిగిందని తెలుసుకున్నారు.. ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ విజయకృష్ణ, ఎస్ఐ హరిబాబు, సిబ్బందితో కలిసి వెళ్ళి కళ్యాణమండపంలో పరిశీలించారు. 158 గ్రాముల బంగారు నగలు, 1.50 లక్షల నగదు చోరీకి గురయ్యాయని పెళ్ళివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అదే సమయంలో పెళ్ళికి వచ్చిన ఓ వ్యక్తి జేబు కొట్టేసి 20 వేల నగదు అపహరించినట్టు తెలిసింది. దీంతో పెళ్ళికి వచ్చిన వారంతా ఖంగుతిన్నారు.. పెళ్ళిలో దొంగల హడావిడిపై చర్చించుకున్నారు.. ఎంత బంధువులైనా పెళ్ళిళ్ళల్లో జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ వ్యాఖ్యానించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..