AP News: బాబోయ్..! భగభగలు.. అప్పుడే సూర్యుడి బ్యాటింగ్ స్టార్ట్.. వచ్చే ౩ రోజులు వాతావరణం ఇలా

ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పొద్దున్న వేడి.. రాత్రి చలితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: బాబోయ్..! భగభగలు.. అప్పుడే సూర్యుడి బ్యాటింగ్ స్టార్ట్.. వచ్చే ౩ రోజులు వాతావరణం ఇలా

Updated on: Feb 14, 2025 | 6:38 PM

దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాయువ్య దిశగా.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఏంటంటే..

———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ :-
—————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి