AP Rains: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో ఏపీకి వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. అటు పలు ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొట్టనున్నాయి. మరి ఆ వెదర్ రిపోర్ట్ ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..

పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 08.30 గంటల సమయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఆవరణము వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తరం వైపుకు కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా పునరావృతమై తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతం మీదుగా క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి తక్కువగా గుర్తించబడినది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు:- —————————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–
ఈరోజు, రేపు:- —————————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:- ——————-
ఈరోజు, రేపు:- —————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తరువాత గణనీయమైన మార్పులేదు . రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తరువాత గణనీయమైన మార్పులేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
