Andhra: ఎవర్రా నువ్వు.! మెంటలోడికే మొగుడులా ఉన్నావ్.. హైటెన్షన్ వైర్లతో ఊగిసలాట.. ఆ తర్వాత
ఓ వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి నానా రచ్చ చేశాడు. అర్ధరాత్రి నుంచి ఇదే పనిలో ఉన్నాడు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటి.? అతడు ఎవరో..? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

మనందరం కూడా నార్మల్‌గా ఆటలు ఆడుతుంటాం. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హాకీ ఇలా ఏదైనా కూడా ఆడటాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఏకంగా కరెంట్‌తోనే కబడ్డీ ఆడాలని చూశాడు. ఆడేశాడని అనుకుంటున్నారా.? టెన్షన్ పడకండి.! ఈలోపే సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిందిదే. తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో ఓ కర్ణాటక వాసి హల్చల్ చేశాడు. అతడు చేసిన పనికి గ్రామస్తులే దెబ్బకు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కడూరు గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న 220 కెవి విద్యుత్ టవర్ ఎక్కాడు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్‌పైనే తాండవం చేశాడు. దాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న వెంటనే రేణిగుంట అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ ఎక్కిన వ్యక్తిని కిందకు దింపేందుకు శతవిధాల ప్రయత్నించారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో పైనున్న శివతో మాట్లాడేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. దీంతో టవర్ చుట్టూ నైలాన్ వలను కట్టి.. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక పైన ఉన్న శివ పోలీసులను చూడగానే టవర్‌కు వేలాడుతూ కిందకు దూకాడు. కిందకు దూకే ప్రయత్నంలో వలపై పడ్డాడు. వల నేలకు తలగడంతో అపస్మార స్థితిలోకి వెళ్లాడు. దీంతో హుటాహుటిన బాలాజీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది.




