Andhra: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఏకంగా దేవుడితోనే ఆటలు.. హుండీలో బొమ్మ నోట్లు..
ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది.

ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది. దేవుడా నేను బాధల్లో ఉన్నాను.. వీటిని తీర్చు.. కష్టాలు తీరి కోలుకుంటే ఫలానాది నీకు సమర్పించుకుంటాను అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, కోరికలు తీరిన తర్వాత కొందరు అనుకున్న విధంగా డబ్బు, తలనీలాలు సమర్పించడం, బంగారం, వెండి , తులా భారం ఇలా పలు విధాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, తాజాగా హుండీలో బొమ్మ నోట్లు చూసి అధికారులే షాకయ్యారు..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల దేవస్ధానం అధికారులు హుండీ లెక్కించారు. దేవస్థానానికి రికార్డు స్ధాయిలో ఆదాయం లభించింది. 41 రోజులకు గాను రూ.4.22 కోట్లకు పైగా నగదు, 569 గ్రాముల బంగారం, 7708 కిలోల వెండి లభించాయి. వీటితో పాటు చెల్లని పాత నోట్లు 30 వరకు రూ.500 , 20 నోట్లు వెయ్యి రూపాయలవి, మూడు 2వేల నోట్లతో పాటు విదేశీ కరెన్సీ ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి బొమ్మనోట్లు 500 కట్టగా వేశారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయి వాటిని పనికి రానివిగా పరిగణించి పక్కన పెట్టారు.
వీడియో చూడండి..
పిల్లలు అనుకోకుండా ఎవరైనా హుండీలో వేశారా..? లేదా? కావాలనే ఇలాంటి పని చేశారో తెలియదు కాని దేవస్ధానం అధికారులతోపాటు.. సిబ్బంది ఆశ్చర్యపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
