
కర్నూలు, అక్టోబర్ 31: భార్యభర్తల మధ్య కీచులాటలు షరా మామూలే. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ గొడవలు సర్దుమనిగి మళ్లీ సంసారం గాడిన పడుతుంది. ఓ వ్యక్తి ఇలాగే భార్యతో గొడవపడ్డాడు. అయితే ఆమె అలిగి పుట్టింటికి పోయింది. అలా వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త అలక పాన్పు ఎక్కడానికి బదులు ఏకంగా సెల్‌టవర్ ఎక్కి అందరినీ హడలు గొట్టించాడు. ఈ విచిత్ర ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం రామచంద్ర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మోహన్ అనే యువకుడు తన భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా మోహన్ గతంలో కూడా కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తాజాగా మరోమారు ఎత్తైన సెల్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరించడంతో రామచంద్రనగర్ కాలనీ నుంచి వాటర్ దగ్గరికి స్థానికులు గుంపులుగా పరిగెత్తుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని ఎలాగోలా బతిమాలి కిందకు దించారు. దీంతో ఊరి జనమంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు మాత్రం మోహన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.