AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం

|

Aug 22, 2024 | 7:37 AM

ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంటోంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వీటిపై విచారణ జరపకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి తమమీదకు రుద్దుతూ...

AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
Tdp Vs Ycp
Follow us on

ఏపీలో రాజకీయ రంగస్థలం వేడెక్కింది. తాజా పరిణామాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెవర్షన్ పాలిటిక్స్ రచ్చ రేపుతోంది. వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్‌ రీసౌండ్‌ ఇస్తోంది. ఏపీలో ఎన్నికల సీజన్ ఐపోయింది అనుకుంటే.. అంతకుమించి హీటెక్కించే పరిస్థితులు ఒక్కటొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా టెంపరేచర్‌ పెంచిన పొలిటికల్ దంగల్ ఏంటంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌. ప్రస్తుతం ఏపీలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంటోంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వీటిపై విచారణ జరపకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి తమమీదకు రుద్దుతూ… డెవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ వర్షన్‌. ఇదే అంశంపై కూటమి సర్కార్‌కు, వైసీపీకి మధ్య వార్ ముదురుతోంది. కూటమి నేతలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పుంగనూరులో జరిగింది ప్రతీకార దాడులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్‌రెడ్డి.

ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి కేసులు ఎదుర్కోటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తప్పు చెయ్యకపోయినా కక్షకట్టి రాజకీయం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చట్ట ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్లీ వస్తుందని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడ చిత్తు కాగితాలు తగలబడినా ప్రభుత్వ ఫైల్స్ దగ్ధమయ్యాయని ప్రచారం చేస్తూ.. ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసి వేధిస్తున్నారని మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆరోపణలు, తప్పుడు ప్రచారానికి పరిమితమవుతున్న తీరు చూస్తే ప్రభుత్వం ఫెయిలైనట్టు కనిపిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఇలా వైసీపీ నేతలంతా వన్‌ బై వన్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతున్నారని వైసీపీ ప్రధాన ఆరోపణ చేస్తోంది. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలు కొట్టేస్తోంది. ఏపీలో కక్షలూ లేవు.. ప్రతీకారాలు లేవన్నారు హోమంత్రి అనిత. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్న ఆరోపణలుకు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు మంత్రి అనిత. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో ఏం జరిగినా రాజకీయమే అవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..