Train Accident: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బగీలు పట్టాలు తప్పాయని, రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు..

Train Accident: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం
Train Accident
Follow us

|

Updated on: Oct 30, 2023 | 7:08 AM

విజయనగరం జిల్లాల్లో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న సయంలో.. దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బగీలు పట్టాలు తప్పాయని, రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్న అధికారులు మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. రైలు ప్రమాద నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

ప్రధాని మోదీ ట్వీట్‌..

ఇక రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ప్రధాని, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. క్షత గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

ఇక ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇక ప్రమాదంలో మృతి చెందిన వారికి సీఎం జగన్‌ పరిహారం ప్రకటించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉంటే రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం అందించనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదం మరణించిన వారికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సీరియల్లో అలా.. నెట్టింట ఇలా.. రుద్రాణి అత్తా మజాకా..
సీరియల్లో అలా.. నెట్టింట ఇలా.. రుద్రాణి అత్తా మజాకా..
బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌... ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే.
బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌... ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే.
ఆదివాసీ గూడాల్లో మొదలైన గుస్సాడి పండుగ..గిరిజనులంతా కలిసి ఇలా..
ఆదివాసీ గూడాల్లో మొదలైన గుస్సాడి పండుగ..గిరిజనులంతా కలిసి ఇలా..
అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.?
అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.?
సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ధోని ఏం చేశాడంటే.. వైరల్ వీడియో
ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ధోని ఏం చేశాడంటే.. వైరల్ వీడియో
'రా' మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన అభియోగాలు..!
'రా' మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన అభియోగాలు..!
హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..
హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.స్వర్గం, నరకం చూసొచ్చానంటూ
చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.స్వర్గం, నరకం చూసొచ్చానంటూ