Parliament Session 2024: పార్లమెంట్‌ తొలిరోజే ఆసక్తికర ఘటన.. సైకిల్‌పై చేరుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి..

|

Jun 24, 2024 | 12:30 PM

పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌కు సైకిల్‌పై చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు.. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు అప్పలనాయుడు. ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్‌ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై చేరుకున్నారు.

Parliament Session 2024: పార్లమెంట్‌ తొలిరోజే ఆసక్తికర ఘటన.. సైకిల్‌పై చేరుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి..
Appalanaidu Kalisetti
Follow us on

పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌కు సైకిల్‌పై చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు.. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు అప్పలనాయుడు. ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్‌ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై చేరుకున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు 15 లక్షల 68 వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఓ సాధారణ వ్యక్తిలా ఇలా సైకిల్‌పై లోక్‌సభకు చేరుకున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి 2 లక్షల 29 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

వీడియో చూడండి..

పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుల ప్రమాణం స్వీకారం కొనసాగుతోంది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ప్రధాని మోదీతో ప్రమాణస్వీకారాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రుల ప్రమాణాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏపీ ఎంపీలు, రేపు తెలంగాణ ఎంపీలు సభలో ప్రమాణం చేయబోతున్నారు.

ఇవాళ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని చెప్పారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు నినాదాలు కాదు.. ప్రజల ఆకాంక్షలకు తగినట్లు అంతా పనిచేయాలన్నారు.