విశాఖలో భారీగా మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. విశాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌తోపాటు.. ఎస్ఈబీ అధికారులు వారంరోజుల వ్యవధిలో 7వేల మత్తు ఇంజెక్షన్లు సీజ్ చేశారు. వేర్వేరు కేసుల్లో మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. విశాఖ సీపీ త్రివిక్రమ వర్మల ఇంటర్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్‌ని నిర్వహించారు. ఆర్పీఎఫ్, జీఆర్‌పీ, ఎస్‌ఈబీ తోపాటు.. సివిల్ పోలీసులు హాజరయ్యారు. ఎవరిమీదైనా ఏమాత్రం అనుమానం కలిగినా అన్ని శాఖలు అలర్ట్ అయ్యేలా కోఆర్డినేషన్ ఉండాలని దిశానిర్థేశం చేశారు. విశాఖని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రగ్స్ అమ్మేవారిని, పెడ్లర్లను ఉపేక్షించేది లేదన్నారు.
వెస్ట్ బెంగాల్ నుంచి విశాఖకు మత్తు ఇంజక్షన్లు దిగుమతి అవుతున్నట్టు గుర్తించామన్నారు సీపీ త్రివిక్రమ వర్మ. శాఖల సమన్వయంతో మత్తు మాఫియాపై ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పెడ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..