Janasena in VSP: పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. బీచ్ రొడ్డులోకి కార్యకర్తలు ఎవరూ రాకుండా చర్యలు

పవన్ కళ్యాణ్ విశాఖ పట్టణంలో నోవాటెల్ హోటల్ లో బస చేసిన సంగతి తెలిసిందే. తమ నాయకుడిని చూసేందుకు హోటల్ సమీపంలో భారీగా జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు నోవాటెల్ హోటల్  వద్ధ భారీగా మోహరించారు.

Janasena in VSP: పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. బీచ్ రొడ్డులోకి కార్యకర్తలు ఎవరూ రాకుండా చర్యలు
Pawan Kalyan In Vsp

Updated on: Oct 17, 2022 | 10:49 AM

జనసేనాని పవన్ కళ్యాణ్  విశాఖ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల పాటు జనసేనాని ఉత్తరాంధ్రలో పర్యటించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.. ఉత్తరాంధ్రలో జనవాణితో పాటు పలు కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ విశాఖ పట్టణానికి చేరుకున్నారు. పవన్ రాక సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలు  విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సందర్భంలో అక్కడ వివాదం చోటు చేసుకుంది. ఏపీ మంత్రులపై జనసేన నేతలు దాడి చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు పలువురు జనసేన నేతలపై కేసులు నమోదు చేసి.. కోర్టు ముందుకు హాజరు పరిచారు కూడా..

 

ఇవి కూడా చదవండి

అయితే పవన్ కళ్యాణ్ విశాఖ పట్టణంలో నోవాటెల్ హోటల్ లో బస చేసిన సంగతి తెలిసిందే. తమ నాయకుడిని చూసేందుకు హోటల్ సమీపంలో భారీగా జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు నోవాటెల్ హోటల్  వద్ధ భారీగా మోహరించారు. జనసేన కార్యకర్తలను చెదరగొడుతున్నారు.

అంతేకాదు బీచ్ రొడ్డులోకి కార్యకర్తలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జనసేన అధినేత అర్ధరాత్రి 11 గంటలకు కూడా నోవోటెల్ హోటల్ బయట ఉన్న వారికి అభివాదం చేశారు. ఈ మేరకు జనసేన నేతలు స్పందిస్తూ.. ఇది సేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. కళ్యాణ్ ని ఎంత నిర్బందిస్తే అంత విజృంభిస్తారు.. ఆయన సహనమే ఆయనకు శ్రీరామరక్ష అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..