
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో శనివారం ఈ ఉదయం 9:30 గంటల సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కార్డియాలజీ విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గది నుంచి మంటలు చెలరేగి దట్టంగా పొగ అలుముకుంది. అప్రమత్తమమైన సిబ్బంది.. హుటా హుటానా పేషంట్లను పక్క వార్డులకు తరలించారు. అసలే ఉద్యోగ సమస్యతో ఆసుపత్రిలో చేరిన రోగుల పరిస్థితి సెన్సిటివ్ గా ఉంటుంది. అటువంటివారిని అతి జాగ్రత్తగా.. 43 మంది పేషంట్లను పక్క వార్డుల్లోకి షిఫ్ట్ చేశారు. హౌస్ కీపింగ్ శానిటేషన్ సిబ్బంది.. నర్సులకు డాక్టర్లకు సహకరించి హుటాహుటిన అందరిని తరలించడంతో పెద్ద ముప్పే తప్పింది.
ఈ లోగా పోలీసులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.. వాళ్లు కూడా ఒకవైపు ప్రమాద తీవ్రతను అదుపు తేవడంతో పాటు.. మరోవైపు పేషంట్లను తరలించారు. మరి కొంతమంది ఫైర్ సిబ్బంది.. మంటలు వ్యాపించిన గదిలోకి వెళ్లారు. ఒకవైపు ఫైర్ ను కంట్రోల్ చేస్తూనే మరోవైపు.. ఆ గది అద్దాలు పగలగొట్టి పొగను బయటకు పంపారు. దీంతో నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఎన్టీఆర్ వైద్య సేవ గదిలోనే..!
కార్డియాలజీ విభాగంలో.. మూడు వార్డులు ఉన్నాయి. వాటిలో ఐసీయూ ఐ ఎమ్ సి యు తో పాటు మరికొన్ని గదుల్లో పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో.. ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీస్ అందించేందుకు ఓ గదిని కేటాయించారు. ఆ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. దట్టంగా పొగ అలుముకొని ప్రమాదానికి దారి తీసింది. ఏసీ పూర్తిగా కాలిపోయింది, కంప్యూటర్లు ధ్వంసం అయ్యాయి. రికార్డులు కొన్ని కాలిపోయాయి. ఫైర్స్ సిబ్బంది మంటలు ఆర్పే క్రమంలో మరికొన్ని ఫైల్స్ నీటిలో తడిచిపోయాయి. షార్ట్ సర్క్యూటే కారణమని ఫైర్స్ సిబ్బంది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
పనిచేయని ఫైర్ ఎస్టింగ్విషర్..!
ఈ ప్రమాదం కేజీహెచ్ లో కీలకమైన కార్డియాలజీ విభాగంలో భద్రత ప్రమాణా లోపాన్ని మరోసారి ఎత్తి చూపింది. దట్టమైన పొగ మంటలు చెలరేగినప్పటికీ.. స్పందించాల్సిన అగ్ని మాపక ఉపకరణాలు పనిచేయలేదు. ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ వాళ్లు తెచ్చుకున్న ఎక్విప్మెంట్ తో పరిస్థితి అదుపులోకి తెచ్చారే తప్ప.. ఫైర్ ఎస్టింగ్విషర్ పనిచేయలేదని అంటున్నారు ఫైర్ ఆఫీసర్ వరప్రసాద్. భద్రత ప్రమాణాల లోపం పై అధికారులకు నివేదిస్తామని అన్నారు.
ఘటన స్థలాన్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు. ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న 12 గంటలపాటు కేజీహెచ్ లో విద్యుత్ నిలిచిపోయి పేషెంట్లు విలవిల్లాడితే.. ఇప్పుడు కార్డియాలజీ విభాగంలో అగ్నిప్రమాదం జరిగి రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని అన్నారు. దిగువ స్థాయి సిబ్బంది సకాలంలో స్పందించకుంటే.. పేషంట్ల ప్రాణాలకే ముప్పు వాటి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్డియాలజీ విభాగంలో అగ్ని ప్రమాద ఘటనపై.. విచారణ ప్రారంభమైంది. అంతర్గతంగా కేజీహెచ్ వైద్యాధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా ఘటనకు గల కారణాలను తేల్చే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కార్డియాలజీ విభాగంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరోసారి కేజీహెచ్ రోగులను ఉలిక్కిపడేలా చేసింది. సిబ్బందిని పరుగులు పట్టించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిలో ఉన్న భద్రతాపరమైన సాంకేతికపరమైన లోపాలు సరిదిద్దు రోగుల భద్రతకు మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.