Heavy Rains: విశాఖ నుంచి స్టడీ టూర్ కోసం వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్లు హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకుపోయారు. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ నెల 16 నుంచి విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులతో కలిసి స్టడీ టూర్ కోసం వెళ్లారు. కొండచరియలు విరిగిపడి, రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పాడింది. దాంతో చేసేది లేక రాత్రంతా బస్సుల్లోనే గడపాల్సి వచ్చింది. వర్షం కారణంగా కొండచరియల్ని క్లియర్ చేసేందుకు రెస్క్యూ టీం సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది.
ఇకపోతే, అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది. సహాయక చర్యల అనంతరం అక్కడి నుంచి చంఢీగఢ్ వెళ్లనున్నారు. చండీగఢ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. కార్పొరేటర్లు నిన్న కులు మునిసిపాలిటీ లోనే పలు ప్రాంతాలను సందర్శించారు. ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలిలో పర్యటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి