TDP: శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. పలాసకు వెళ్తున్న లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు
19వ తేదీన.. అర్ధరాత్రి సమయంలో.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత యత్నంతో వివాదం చెలరేగింది. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడంపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. 19వ తేదీన.. అర్ధరాత్రి సమయంలో.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత యత్నంతో వివాదం చెలరేగింది. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడంపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రి సీదిరి అప్పల్రాజుపై ఎమ్మెల్యే బెందళ అశోక్ కామెంట్‌తో పరిస్థితి విషమించకుండా పోలీసులు అలెర్ట్ అయ్యారు. నేతలు పలాసకు వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కూన రవిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. రవి నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.
పలాస లక్ష్మీపురం దగ్గర ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడును అడ్డుకున్నారు పోలీసులు. ఆయనతోపాటు బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న రామ్మోహన్ నాయుడు, శిరీషను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అచ్చెన్నాయుడు. పలాసకు ఎందుకు వెళ్లొద్దో చెప్పాలని డిమాండ్ చేశారు. పలాసకు ఎందుకు వెళ్లకూడదో లేఖ ఇవ్వాలని పోలీసులను నిలదీశారు.
హైవేపై అడుగడుగునా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మండపం టోల్‌ప్లాజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ నేతలు పలాసకు వెళ్లే అన్ని దారుల్లో మోహరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం