Vijayasai reddy : ‘తను చక్రం తిప్పినన్ని రోజులు వదిలేసి, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానమేంటి.? ‘ : విజయసాయి

|

Jun 02, 2021 | 4:51 PM

చంద్రబాబు కూడా గతంలో హైదరాబాద్‌లో ఉండే కొన్నాళ్ళు పాలన చేసి పారిపోయి వచ్చారని..

Vijayasai reddy : తను చక్రం తిప్పినన్ని రోజులు వదిలేసి, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానమేంటి.?  : విజయసాయి
Mp Vijayasaireddy And Avant
Follow us on

YSRCP MP Vijayasai reddy : CRDA చట్టానికి, రాజధాని తరలింపుకు సంబంధం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు కూడా గతంలో హైదరాబాద్‌లో ఉండే కొన్నాళ్ళు పాలన చేసి పారిపోయి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. అలానే ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన సాగించొచ్చని, విశాఖలో ఉన్నా, అమరావతి లో ఉన్నా ఇబ్బంది లేదని విజయసాయి తెలిపారు. రాజధాని స్థాయీ మౌళిక సదుపాయాల కల్పన విశాఖలో శరవేగంగా సాగుతోందని ఎంపీ చెప్పారు. కాగా, విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల శంకుస్థాపన చేసిన విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపై ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్, స్థానిక మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

విశాఖపట్నం జిల్లాలో కొవిడ్ పరిస్థితులపై ఈరోజు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్ తో కలిసి పాల్గొనడం జరిగిందని ఆయన తెలిపారు. పనిలో పనిగా ట్విట్టర్ వేదికగా విజయసాయి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ విమర్శలు చేశారు. “రంగు వెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్పూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలి. ప్రజలతో మమేకమై వారి అభిమానం చూరగొనాలని చెప్పాలి. బాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి. విద్వేషాలు రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నాడు.” అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.

“బాబు జూమ్ మహానాడు ఊసుపోక అందరితో తిట్టించుకునేందుకు పెట్టినట్టే ఉంది. తను చక్రం తిప్పినన్ని రోజులు పట్టించుకోకుండా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానం చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. బిజెపితో కలిసి పనిచేయాలన్న ఆలోచనను కమలం పార్టీ నేతలు తూర్పార పట్టారు.” అంటూ మళ్లీ టీడీపీ అధినేతపై సెటైర్లు వేశారు.

Read also : YS Sharmia : ఉమ్మడి మెదక్ జిల్లాలో షర్మిల పర్యటన.. ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలిస్తారో చెప్పాలని డిమాండ్