మంత్రి ఇంటి ముందు.. యువతి ఆత్మహత్యాయత్నం..!!

తూర్పుగోదావరి జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలంగా మారింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ.. ఏపీ మంత్రికి ఎన్నిసార్లు ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతోంది. దీంతో.. ఆమె సమస్యను.. స్థానిక మంత్రికి విన్నవించుకుందామని శుక్రవారం వెళ్లింది. అయినా.. ఆమె […]

మంత్రి ఇంటి ముందు.. యువతి ఆత్మహత్యాయత్నం..!!

తూర్పుగోదావరి జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలంగా మారింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ.. ఏపీ మంత్రికి ఎన్నిసార్లు ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతోంది. దీంతో.. ఆమె సమస్యను.. స్థానిక మంత్రికి విన్నవించుకుందామని శుక్రవారం వెళ్లింది. అయినా.. ఆమె ఎన్నిసార్లు వచ్చినా.. మంత్రి అనుమతి ఇవ్వకపోవండంతో.. మనస్తాపం చెందిన ఆమె మంత్రి ఇంటి ముందు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో.. అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా.. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మంత్రి ఇంట్లో లేరని సమాచారం.