Vizag: విశాఖలో AR ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు

విశాఖలో AR ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. పదేళ్ల జైలు శిక్ష విధించగలిగే సెక్షన్ 386 ఎక్స్‌టార్షన్‌ కేసు పెట్టారు. ఆమె చంపేస్తామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా విచారణలో వెల్లడయ్యింది. స్వర్ణలతతోపాటు హోంగార్డ్‌లు మెహర్, శ్రీను, బ్రోకర్ సూర్య అరెస్ట్‌ అయ్యారు.

Vizag: విశాఖలో AR ఇన్స్‌పెక్టర్ స్వర్ణలతపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు
Inspector Swarnalatha
Follow us

|

Updated on: Jul 07, 2023 | 10:18 AM

ఆమె ఒంటిపై ఖాకీ యూనిఫామ్ ఉంది. ఖాకీల సంఘానికి ఉపాధ్యక్షురాలి హోదా వల్ల కొంతమేర ఖద్దరుతో కాంటాక్ట్స్‌ ఉన్నాయి. కట్ చేస్తే.. ఆరెండిటినీ వాడి ఆమె చేస్తున్న అక్రమాలకు హద్దూపద్దూ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. దానికి కారణం.. తాజాగా బయటపడిన ఆమె అక్రమదందా.! అవును, ఇదంతా విశాఖలో AR ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న స్వర్ణలత వ్యవహారం. విశాఖలో ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన నయాదందాకు నిలువెత్తు నిదర్శనం ఈ వార్త. ఆమె పేరు స్వర్ణలత. AR ఇన్స్‌పెక్టర్‌. పైగా ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది. ఒంటిపై ఖాకీ పవర్.. కొందరు పొలిటీషిన్లతో సంబంధాలున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా కొందరిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారామె. ఆమె ఫాలో అయిన విధానం కూడా చాలా సినిమాటిక్‌గా ఉంది.

2వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇచ్చాక.. దాన్ని కూడా ఓ ఆదాయ వనరుగా మార్చుకుంది స్వర్ణలత. రెండువేల నోట్లు నా దగ్గర ఉన్నాయి.. నాకు 90లక్షలు ఇస్తే, నేను 2వేల నోట్లు కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ బ్రోకర్‌ని సెట్ చేసుకుంది. అతనే సూర్య. అలా ఓ పార్టీకి గాలం వేసింది స్వర్ణలత. 90లక్షల క్యాష్‌తో సదరు వ్యక్తులు రోడ్డెక్కగానే.. పోలీస్ వెహికిల్‌లో ఎదురొచ్చి వాళ్లపై రెయిడ్స్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది స్వర్ణలత. అదే టైమ్‌లో హోంగార్డులుగా ఉన్న అనుచరులు మెహర్, శ్రీనులు.. డబ్బు తీసుకొచ్చిన వాళ్లను బెదిరించారు. దొంగనోట్లా, దొంగతనం చేసుకొచ్చిన డబ్బా అంటూ చావబాదారు. కేసు లేకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని బెదిరించి అక్షరాలా 15లక్షలు కొట్టేసింది స్వర్ణలత. విచారణలో ఇదంతా బయటపడడంతో ఆమెపై కేసులు పెట్టారు ఉన్నతాధికారులు.

స్వర్ణలతపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. యూనిఫామ్‌లో వెళ్లి సివిల్‌ కేసుల సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. వ్యవహారం స్టేషన్‌ దాకా రాకుండానే అనేక కేసులు క్లోజ్‌ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అనేక మంది సీఐలు కూడా ఆమెను సెటిల్మెంట్లకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..