Gudivada Amarnath Reddy : భూకబ్జాలన్నీ చంద్రబాబు కన్నుసన్నల్లోనే.. ఆయన ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌ : గుడివాడ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌' అని అభివర్ణించారు వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్...

Gudivada Amarnath Reddy : భూకబ్జాలన్నీ చంద్రబాబు కన్నుసన్నల్లోనే.. ఆయన ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌ : గుడివాడ
Gudivada Amarnath

Updated on: Jun 14, 2021 | 11:15 PM

Anakapalli MLA Amarnath reddy : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ అని అభివర్ణించారు వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్. విశాఖ‌లో భూకబ్జాలన్నీ చంద్రబాబు కన్నుసన్నల్లోనే టీడీపీ నేతలు చేశారని ఆయన విమ‌ర్శించారు. తప్పు చేసిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయ‌న హెచ్చరించారు. సోమ‌వారం విశాఖ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు.

విశాఖలో భూములను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ క్రమంలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

భూకబ్జాదారుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని గుడివాడ చెప్పుకొచ్చారు. విశాఖ నడిబొడ్డున సైతం భూములను ఆక్రమించారని మండిపడ్డారు. దీనిపై ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read also : Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన