తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కాకినాడలో గురువారం నాడు ఎస్పీ ఎదుట మావోయిస్టు దళానికి చెందిన దళ సభ్యులు ఇద్దరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరిని కొవ్వాసి సునీ, కలుమ మనోజ్‌గా గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా ఎస్పీ రూ.5 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
కాగా, విశాఖలో గత నెలలో మావోయిస్టుల అలజడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఆర్కే తప్పించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
Read More :