తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ వెల్లడించనుంది. రెండు సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ని తగ్గించాలని

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 10:05 AM

Telangana Intermediate Syllabus: ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ వెల్లడించనుంది. రెండు సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటివరకు నష్టపోయిన పనిరోజులకు అనుగుణంగా ఈ సిలబస్‌ని తగ్గించనున్నారు. సీబీఎస్‌ఈ మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్ట్‌ల్లో  విధించిన కోత సిలబస్‌కి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్‌లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించనున్నారు. ఇక అంతకుముందు పనిదినాలు 222 ఉంటే.. ఈ ఏడాది 40 రోజులు తగ్గించి, 182 రోజులుగా పరిమితం చేశారు. తొలిగించిన పాఠ్యాంశాల వివరాలకు సంబంధించి త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించనుంది. ఇదిలా ఉంటే మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి, పలు కారణాలతో పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. అటు ఏపీలోనూ ఇంటర్‌ విద్యార్థులకు సిలబస్ తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read More:

రైల్వే ప్రయాణికులకు షాక్‌.. ఇకపై ‘యూజర్ ఛార్జీలు’

కరోనా లాక్‌డౌన్‌‌.. 66 లక్షల మంది ఉద్యోగాలు పోయాయట