రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు

శీతాకాలం విడిది కోసం.. హైదరాబాద్ నగరానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్.. ఆదివారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కాగా, ఈ విందు కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం […]

  • Updated On - 1:18 am, Mon, 23 December 19 Edited By:
రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు

శీతాకాలం విడిది కోసం.. హైదరాబాద్ నగరానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్.. ఆదివారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు.

కాగా, ఈ విందు కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరితో పాటు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్, హైకోర్టు న్యాయమూర్తులు.. సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. “ఇండియన్‌ రెడ్‌క్రాస్‌” మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు.