అక్కడ టమాట కిలో రూ.48 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

రైతు బజారు వద్ద ఉదయం 6 గంటల నుంచే.. ప్రజలు కిలోమీటరు మేర బారులు తీరారు. బయట మార్కెట్లో కిలో టమాట 80 రూపాయలు ధర పలుకుతుంది. దీంతో జనమంతా సబ్సిడీ మీద ఇచ్చే టమాటాల కోసం రైతు బజారుకు తరలివచ్చారు. ఇతర రైతు బజారుల్లోనూ టమాటలు అందుబాటులో ఉంచాలని, ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అక్కడ టమాట కిలో రూ.48 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!
Subsidy Tomatoes

Updated on: Jul 25, 2024 | 9:13 AM

టమాట ధరలు కొండెక్కి కూర్చోవటంతో జనం చుక్కలు చూస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో టమాటలు కొనాలంటే జంకుతున్నారు. కొన్నిచోట్ల సబ్సిడీకి టమాటాలు అందిస్తున్న నేపథ్యంలో చాలా మంది తెల్లవారుజాము నుంచే లైన్​లలో వేచి చూస్తున్నారు. తాజాగా విశాఖపట్నం రైతు బజారు వద్ద ఉదయం 6 గంటల నుంచే.. ప్రజలు కిలోమీటరు మేర బారులు తీరారు. బయట మార్కెట్లో కిలో టమాట 80 రూపాయలు ధర పలుకుతుంది. దీంతో జనమంతా సబ్సిడీ మీద ఇచ్చే టమాటాల కోసం రైతు బజారుకు తరలివచ్చారు. ఇతర రైతు బజారుల్లోనూ టమాటలు అందుబాటులో ఉంచాలని, ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..