AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జాలరి పంట పండింది.. వలకు చిక్కిన బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న చేప..!

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25కిలోల బరువు ఉండే ఈ చేప చిక్కింది. అత్యంత అరుదుగా కనిపించే చేపల మత్స్యకారుల వలలో పడింది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు.

ఆ జాలరి పంట పండింది.. వలకు చిక్కిన బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న చేప..!
Golden Fish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 24, 2024 | 1:35 PM

Share

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25కిలోల బరువు ఉండే ఈ చేప చిక్కింది. అత్యంత అరుదుగా కనిపించే చేపల మత్స్యకారుల వలలో పడింది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు. ఈ చేప దాదాపు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకుని వచ్చేస్తుంటాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు సీలేరు నదికి వరద నీరు పోటెత్తుతోంది. నది పూర్తిగా రంగు మారి ఎర్రగా కనిపిస్తోంది. దీంతో జాలర్లు చేపల వేటకు స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఈ సీజన్లో అరుదుగా లభించే బంగారు తీగ చేప సీలేరు నది రిజర్వాయర్లలో జాలర్లకు చిక్కుతుంటుంది. జీకేవీధి మండలం సీలేరు నదిలో జాలర్లు యథావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలరికి 25కిలోల అతి అరుదైన గెలస్కోపి, మిలట్రీ మౌస్ చేప వలకు చిక్కింది. దాన్ని వనములు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చివరకు ఓ వ్యక్తి దాన్ని ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నాడు. ఈచేప 5 కిలోలనుంచి 40, 50 కిలోల వరకు బరువు పెరుగుతుందంటున్నారు మత్స్యకారులు.

వీడియో చూడండి… 

ఈ చేపలో 68శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ అసీడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎంతో విలువలు దీనికి కలిగి ఉన్నాయి. అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతం అడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెలా రిజర్వాయర్లలో ఈ చేపల జీవనం సాగిస్తాయి. ఈ చేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైన లక్షణం ఉంటుంది. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్ లోకి వస్తుంటాయని అంటున్నారు మత్స్యకారులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్