Pig Fight Competition: విశాఖ వీధుల్లో పందుల పందేలు.. ఊలలు, అరుపులు.. స్థానికులు బెంబేలు

|

Sep 03, 2021 | 4:05 PM

స్మార్ట్‌ సిటీగా చెప్పుకునే విశాఖ నగర రోడ్లపైనే బహిరంగంగా పందులకు పోటీలు నిర్వహిస్తున్నారు. పెదగంట్యాడ సమీపంలోని కొత్తకర్ణవానిపాలెం....

Pig Fight Competition: విశాఖ వీధుల్లో పందుల పందేలు.. ఊలలు, అరుపులు.. స్థానికులు బెంబేలు
Pig Fight
Follow us on

కోళ్ల పందేలు తెలుసు.. ఎడ్ల పందేలు కూడా చుశాం.. చివరకు గొర్రెల పందేలు కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి. అయితే, తాజాగా ఓ చోట పందుల పందేలు నిర్వహించారు. వినటానికి వింతగా అనిపించినా.. నిజంగానే అక్కడ పందుల పెంపకం దారులు ఎగబడి మరీ పందేలు కాశారు. విశాఖలో పందుల పెంపకందారులు బరితెగిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ జనావాసాల మధ్య పందులను పెంచడం, పందులను పట్టుకునేందుకు వచ్చే జీవీఎంసీ సిబ్బందిపై తిరగబడటం వంటివే కాకుండా ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. స్మార్ట్‌ సిటీగా చెప్పుకునే విశాఖ నగర రోడ్లపైనే బహిరంగంగా పందులకు పోటీలు నిర్వహిస్తున్నారు.  పెదగంట్యాడ సమీపంలోని కొత్తకర్ణవానిపాలెం వుడా కాలనీలో వాకర్స్‌ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బహిరంగంగా పెంపకందారులు పందుల పందాలు నిర్వహించారు. రెండు పందుల మధ్య పోటీ పెట్టి వారంతా చుట్టూ చేరి కేరింతలు కొట్టారు. యువకులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. పెద్దగా కేకలు వేస్తూ యువకులు రెచ్చిపోయారు.

ఈ పందుల పోటీల దెబ్బకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటువైపుగా వెళుతున్న వాహదనారులు హడలిపోయారు. ఒక పక్క జీవీఎంసీ అధికారులు పందులను ఏరివేస్తుంటే.. మరోపక్క పెంపకందారులు ఈ పోటీలను నిర్వహించి షాకిచ్చారు. భవిష్యత్‌లో ఇటువంటివి జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే పోటీలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పందుల వలన ప్రమాదం ఉందంటున్నారు. మరి ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

 

 

 

Also Read: టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోన్న ‘ఎఫ్‌ క్లబ్‌’.. ఆ రోజు పార్టీకి వచ్చినవారిపై నజర్.. నవదీప్‌పై ఫోకస్

సిద్ధార్థ్ శుక్లా మరణం వెనుక మిస్టరీ.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలని పూర్తి రీజన్.. నెక్ట్స్ హిస్టోపథాలజీ