AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకు దరఖాస్తులు! రాత పరీక్ష లేదు

రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ చేయాలనుకునే అభ్యర్థులకు నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR).. పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)–NWR దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకు దరఖాస్తులు! రాత పరీక్ష లేదు
RRC NWR Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 08, 2026 | 8:51 AM

Share

రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ చేయాలనుకునే అభ్యర్థులకు నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)–నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకం ద్వారా అజ్‌మేర్, బికనీర్, జైపుర్, జోధ్‌పుర్‌ ప్రాంతాల్లోని వివిధ రైల్వే డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో అప్రెంటిస్‌ శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, COPA తదితర ట్రేడ్‌లలో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అప్రెంటిస్‌ పోస్టులు ప్రధానంగా కింది వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఉన్నాయి..

ఏయే యూనిట్లలో?

  • డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ – అజ్‌మేర్
  • డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ – బికనీర్
  • డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ – జైపుర్
  • డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ – జోధ్‌పుర్
  • BTC క్యారేజ్ – అజ్‌మేర్
  • BTC లోకో – అజ్‌మేర్
  • క్యారేజ్ వర్క్స్ షాప్ – బికనీర్
  • క్యారేజ్ వర్క్స్ షాప్ – జోధ్‌పుర్

అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి (10th/Matriculation) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ITI) కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 6 నవంబర్ 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. ఇతర కేటగిరీలకు వర్తించే సడలింపులు నోటిఫికేషన్ ప్రకారం ఉంటాయి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. అయితే SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ అప్రెంటిస్‌షిప్‌ ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు. మెట్రిక్యులేషన్, ITIలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుంది. రైల్వే అప్రెంటిస్‌ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసే ముందు ట్రేడ్ వారీగా ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6, 2026.
  • వయసు లెక్కింపు తేదీ: నవంబర్ 6, 2026 నుంచి

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్
భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్