ఆ మున్సిపాలిటీలను మోడల్ టౌన్‌లుగా మార్చండి…
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను మోడల్ టౌన్‌లుగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ రెండు పట్టణాలు రెండు కళ్లలాంటివని మంత్రి అన్నారు. ఇందుకు అవసరమైన కాంప్రేహెన్సివ్ సిటీ
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను మోడల్ టౌన్‌లుగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ రెండు పట్టణాలు రెండు కళ్లలాంటివని మంత్రి అన్నారు. ఇందుకు అవసరమైన కాంప్రేహెన్సివ్ సిటీ డెవలప్‌మెంట్ ప్లాన్ తయారు చేయాలన్నారు. మసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో రెండు మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు.
వచ్చే ఆరు నెలల్లో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తామన్నారు ఈటెల. పట్టణాల్లో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, పార్కులు, ఫుట్‌పాత్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్, కూరగాయల, మాంసం మార్కెట్లు, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, చెరువుల సుందరీకరణ, ట్యాంక్ బండ్‌ల నిర్మాణం, రింగ్‌రోడ్డు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని మంత్రి ఈటల సూచించారు.
అధికారులంతా సమన్వయంతో పని చేయాలని, మార్పు కనిపించేలా అభివృద్ధి చేయాలని ఈటల సూచించారు. పట్టణాల్లో మురుగు నీరు నిల్వకుండా చూడాలని, నీళ్లు నిల్వడం అంటే అది క్యాన్సర్ పుండులాంటిదేనన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, టౌన్ ప్లానింగ్ రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా తయారు చేయాలే తప్ప.. తాత్కాలికంగా పనులు చేయొద్దని ఆదేశించారు.