ఆందోళనకరంగా మధులిక ఆరోగ్యం

హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స అందుకుంటున్న మధులిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిన్నటి బులిటెన్‌లో మధులిక కోలుకుంటుందని తెలిపిన వైద్యులు నేటి బులిటెన్‌లో మాత్రం ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్‌ సోకడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, జ్వరంతో బాధపడుతోందని చెప్పారు. ప్రేమోన్మాది దాడి చేసిన కత్తి తుప్పు పట్టినది కావడంతోనే మధులిక శరీరం ఇన్‌ఫెక్షన్‌కు గురైందని చెప్పారు […]

ఆందోళనకరంగా మధులిక ఆరోగ్యం

హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స అందుకుంటున్న మధులిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిన్నటి బులిటెన్‌లో మధులిక కోలుకుంటుందని తెలిపిన వైద్యులు నేటి బులిటెన్‌లో మాత్రం ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని తెలిపారు.

ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్‌ సోకడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, జ్వరంతో బాధపడుతోందని చెప్పారు. ప్రేమోన్మాది దాడి చేసిన కత్తి తుప్పు పట్టినది కావడంతోనే మధులిక శరీరం ఇన్‌ఫెక్షన్‌కు గురైందని చెప్పారు వైద్యులు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ముధులిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సి వస్తోందని డాక్టర్లు బులిటెన్‌లో తెలిపారు.

Published On - 9:16 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu