Tourism : భీమిలి – భోగాపురం మధ్య పర్యాటకంపై జగన్ సర్కారు ఉత్తర్వులు.. ‘భారత్ మాల’ ప్రాజెక్టు కింద బీచ్ కారిడార్

|

May 13, 2021 | 9:34 PM

Bheemili - bhogapuram : ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. సాగర తీర ప్రాంతం భీమిలి - భోగాపురం మధ్య పర్యాటక అభివృద్ధి పై జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది...

Tourism : భీమిలి - భోగాపురం మధ్య పర్యాటకంపై జగన్ సర్కారు ఉత్తర్వులు.. భారత్ మాల ప్రాజెక్టు కింద బీచ్ కారిడార్
Bheemili To Bhogapuram
Follow us on

Bheemili – Bhogapuram : ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. సాగర తీర ప్రాంతం భీమిలి – భోగాపురం మధ్య పర్యాటక అభివృద్ధి పై జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 1021 కోట్ల రూపాయల వ్యయంతో బీచ్ కారిడార్ అభివృద్ధికి రంగం సిద్ధం చేస్తోంది. ‘భారత్ మాల’ ప్రాజెక్టు కింద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తో కలిసి బీచ్ రోడ్డు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫలితంగా 15, 852 ఎకరాలలో ప్రత్యేక అభివృద్ధి ప్రాంతం ఏర్పాటు చేయబోతోంది. ఇటీవలి కేబినెట్ సమావేశంలో తెలిపిన ఆమోదం మేరకు ఈ సాయంత్రం ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాఉండగా, మే 4వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గం విశాఖపట్నానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు బీచ్ రోడ్ లో 19 కి.మీ. మేర ఆరు వరుసల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాల్సి ఉంది.

అలాగే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 11 బీచ్‌లను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. గతంలో వీఎంఆర్‌డీఏ కైలాసగిరిపైనే స్కై టవర్‌ నిర్మాణానికి ప్రతిపాదించింది. అది కమిషనర్‌ మారగానే మూలన పడింది. కాపులుప్పాడలో ప్రత్యేక రాష్ట్ర అతిథి గృహం నిర్మాణం బాధ్యతలు పర్యాటక శాఖకు అప్పగించాలని కూడా సదరు మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు.

Read also : Annapurna Meals : లాక్ డౌన్‌లో అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం.. ఇప్పుడు గ్రేటర్లో రోజూ 45వేల మందికి..