AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు.. రూ.100 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్..

International travel Cruises : డెస్టినేషన్ సిటీ.. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ.. బీచ్ సిటీ.. ఇలా క్రేజీ సిటీగా పేరు గడించిన విశాఖపట్నం నుంచి ఇకపై

Visakhapatnam: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు.. రూ.100 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్..
International Travel Cruise
Shaik Madar Saheb
|

Updated on: Nov 30, 2021 | 1:40 PM

Share

International travel Cruises : డెస్టినేషన్ సిటీ.. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ.. బీచ్ సిటీ.. ఇలా క్రేజీ సిటీగా పేరు గడించిన విశాఖపట్నం నుంచి ఇకపై విదేశాలకు విహారనౌక సర్వీసులు ప్రారంభించే దిశగా వైజాగ్ పోర్ట్ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం వైజాగ్ పోర్ట్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలని నిబంధనలు సైతం పెట్టారు. సుమారు 100 కోట్ల ఖర్చుతో ఈ క్రూయిజ్ నిర్మాణం ఏడాది లోపు పూర్తి చేయనున్నారు. ఇందులో బెర్త్ కాస్ట్ 65 కోట్లు కాగా టెర్మినల్ బిల్డింగ్ 35 కోట్లు తో నిర్మించేలా అంచనాలు, అనుమతుల మంజూరు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఒకవైపు క్రూయిజ్ టెర్మినల్ పనులు ప్రారంభం కానుండగా.. మరోవైపు ఆ సమయం నాటికి విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు రప్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. నౌకాయాన శాఖతో పాటు టూరిజం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ట్రావెల్ ఆపరేటర్స్‌తో ఆ దిశగా చర్చలు ప్రారంభించారు. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి. ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి.. విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీలుగా సర్వీసులు ఉండేలా షిప్పింగ్‌ ఏజెంట్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విహార నౌకలు ప్రయాణీకులకు ఫైవ్ స్టార్ హోటళ్లలోని సౌకర్యాలను అందిస్తాయి. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్‌ గేమ్స్‌, థియేటర్లు, డాన్స్‌ ఫ్లోర్స్‌ లాంటి వినోదాన్ని అందినే అని సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒక్కో క్రూయిజ్ లో 1500 మంది నుంచి 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు.

దీనిపై విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ మాట్లాడుతూ.. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ అందుబాటులోకి రానుండడం ఒక మైల్ స్టోన్ అన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్, కేంద్ర నౌకాయాన సంస్థ, కేంద్ర, రాష్ట్రాల పర్యాటక శాఖల భాగస్వామ్యంతో క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏర్పడుతోందని తెలిపారు రామ్మోహన్ రావ్. నిర్వహణకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, విశాఖకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈ క్రూయిజ్ టెర్మినల్‌ ఎంతో ఉపయోగపడుతుందని, సాధ్యమైనంత త్వరలో ఈ కలను సాకారం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావ్ వివరించారు.

Also Read:

Viral Video: వామ్మో ఇదేం పాము.. నది ఒడ్డున సేదతీరుతున్న భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?