AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: తీరానికి వచ్చిన భారీ డాల్ఫిన్.. తిరిగి తీసుకెళ్లి నీటిలోకి వదిలినా…. పాపం

తిరిగి దాన్ని నీటిలోకి పంపేందుకు యువకుల ప్రత్నించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

Vizag: తీరానికి వచ్చిన భారీ డాల్ఫిన్.. తిరిగి తీసుకెళ్లి నీటిలోకి వదిలినా.... పాపం
Huge Dolphin
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2023 | 5:13 PM

Share

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం తంతడి – వాడపాలెం తీరానికి అరుదైన ఓ డాల్ఫిన్ కొట్టుకు వచ్చింది. అనారోగ్యమో, మరే ఇతర కారణమోగానీ సముద్ర తీరానికి వచ్చి చాలాసేపు అక్కడే తిరిగింది. అయితే ఇసుక వైపు వచ్చేస్తున్న ఆ సముద్రపు డాల్ఫిన్‌ను… గుర్తించిన స్థానిక యువకులు తిరిగి లోపలకు పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణాల విడిచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..వాడపాలెం తీరానికి బుధవారం మధ్యాహ్నం డాల్ఫిన్ (మత్స్యకారులు గనుము అంటారు) కొట్టుకువచ్చింది. దానిని కొవిరి గోవిందరావు, వంకా ప్రశాంత్ అనే యువకులు చూశారు. కొనఊపిరితో వున్న డాల్ఫిన్‌ను అతి కష్టం మీద సముద్రంలోకి నెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. చనిపోయి తిరిగి తీరానికి కొట్టుకు వచ్చింది. మత్స్యకారులు డాల్ఫిన్‌ను తినరు. అందుకే వలలకు చిక్కినా తిరిగి సముద్రంలోనే వదిలేస్తారు. లోతైన సముద్రంలోనే తప్ప… తీరంలో ఈ డాల్ఫిన్లు కనబడవు. అయితే చుట్టుపక్కల వున్న కర్మాగారాల నుంచి వ్యర్థ జలాలు సముద్రంలో కలవడంతో నీరు కలుషితమై సముద్ర జీవులు మృతికి కారణమై ఉండొచ్చని మత్స్యకారులు అంటున్నారు. 8 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో దాదాపు 200 కిలోల వరకు ఉంటుంది. ఈ అరుదైన డాల్ఫిన్ ఇలా మృత్యువాత పడి ఒడ్డుకు చేరడంతో స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?