AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

అర్నబ్ అతి తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ కాగా, పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్‌ నేపథ్యంలో అక్టోబర్‌ 27, 28 తేదీల్లో 53 రైళ్లు రద్దయ్యాయి. కాకినాడలో తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
Cyclone Arnab Update
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2026 | 7:41 AM

Share

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ అతి తీవ్ర తుఫానుగా బలపడింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. కోస్తా జిల్లాలతోపాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ సూచించారు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. అర్నబ్ తుఫాన్‌తో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూ.గోదావరి, యానాం, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు.. బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాలకు వరద హెచ్చరికలు చేశారు.

రెండు రోజులు సెలవులు..

తుఫాన్‌ కారణంగా కోస్తా, ఉత్తరాంధ్రలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. అనకాపల్లి జిలాల్లో 27,28,29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ఈనెల 30 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.

అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. ఏపీలో ఇవాళడు, రేపు 53 రైళ్లు రద్దు

తుఫాన్ నేపథ్యంలో దక్షిణకోస్తా రైల్వే అధికారులు 53 రైళ్లు రద్దుచేశారు. విజయవాడ, రాజమండ్రి, మచిలీపట్నం, గుడివాడ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణకు అధికారులకు బాధ్యతలు అప్పగించడంతోపాటు.. NDRF, SDRF బృందాలను సిద్ధం చేశారు. అల్లూరి జిల్లాలో వాగులు, గెడ్డలు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అధికారుల సూచనలు పాటించి సహకరించాలని సూచనలు చేశారు.

విశాఖ జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను ఇప్పటికే ఒడ్డుకు చేర్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అంటున్నారు అధికారులు.

ముఖ్యంగా బాపట్ల జిల్లాలోనే అధిక వర్షపాతం నమోదు కాబోతుందన్న అంచనాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు కలెక్టర్.

అటు కాకినాడ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉంది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 89 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం 101 సెంటర్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలితే వెంటనే తొలగించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో వర్షాలు..

ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Follow Us