CISF constable: ఆయన బాధ్యతగల కేంద్ర బలగాల్లో ఓ కానిస్టేబుల్.. ఫ్లైట్లలోనే ప్రయాణిస్తాడు..!
ఆయన బాధ్యతగల కేంద్ర బలగాల్లో ఓ కానిస్టేబుల్.. ఫ్లైట్లలోనే ప్రయాణిస్తాడు..! ఒంటిపై ఖాకీ డ్రెస్సు వేసుకున్న సంగతి మరిచాడో ఏమోగానీ..
CISF constable Gowri Shankar: ఆయన బాధ్యతగల కేంద్ర బలగాల్లో ఓ కానిస్టేబుల్.. ఫ్లైట్లలోనే ప్రయాణిస్తాడు..! ఒంటిపై ఖాకీ డ్రెస్సు వేసుకున్న సంగతి మరిచాడో ఏమోగానీ.. తన వృత్తినే అడ్డదారులకు వాడుకుంటున్నాడు. యధేచ్చగా లిక్కర్ దందా చేసేస్తున్నాడు. విమానంలో ఖాళీ పెట్టెలతో వెళ్ళి రైల్లో మద్యం బాటిళ్ళు నింపి దిగుమతి చేసేస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మద్యం నింపిన ట్రంకు పెట్టెలపై బాంబ్ ఎక్యూప్ మెంట్ అని ముద్రవేసి నిఘా వర్గాలకు మస్కా కొట్టేస్తున్నాడు.
ఎస్.. విశాఖలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యే వ్యవహారమిది. ఇతర ప్రాంతాలనుంచి విశాఖకు దిగుమతి అయిపోతుందని ఎస్ ఈ బీ కి సమాచారం అందింది. కూపీ లాగేసరికి లింక్ దిల్లీకి తగిలింది. దిల్లీ నుంచి వచ్చే ఏపీ ఎక్స్ ప్రెస్ పై నిఘా పెట్యారు ఎస్ ఈ బీ అధికారులు. దీంతో 2 బాక్సుల్లో దిల్లీ నుంచి లిక్కర్ వస్తున్నట్టు తెలుసుకుని కాపుకాశారు. దువ్వాడలో కాపుకాసిన అధికారులకు ఆ వ్యక్తి చిక్కలేదు. ఇక.. అనకాపల్లిలోనూ అదే ట్రైన్ పై నిఘా పెట్టారు. కానీ అక్కడా ఎవరూ దిగలేదు. అనుమానాస్పద పెట్టెలు కూడా కనిపించలేదు. రైలు విశాఖ వచ్చాక.. ట్రైన్ ఖాళీ అయింది. కానీ రైలులో 2 ట్రంకు పెట్టెలు కనిపించాయి. వాటిపై పోలీస్, బాంబ్ స్క్వాడ్ అని రాసివుంది. కానీ ఎవరూ వాటిని తీసుకెళ్ళలేదు. అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ అధికారుల సాయంతో 2 ట్రంకు పెట్టెలను స్వాధీనం చేసుకున్న ఎస్ ఈ బీ అధికారులు… వాటిని తెరుచారు. ఇక చెప్పేదేముందీ..! అందులో ఉండేవి బాంబ్ స్క్వాడ్ ఎక్యూప్ మెంట్ కాదు.. పెట్టెల నిండా లిక్కర్ బాటిళ్ళు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 143 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్ళు గుర్తించారు. ఇక.. పెట్టెల్లో మద్యం ఉంది కానీ.. నిందితుడెవరూ పట్టుబడలేదు. మరి బాంబ్ ఎక్యూప్ మెంట్ ట్రంకుపెట్టెల్లో మద్యం ఎలా దిగుమతి అయిపోతోంది. నిందితుడు తప్పించుకున్నాడా..? తప్పుకున్నాడా..? నిందితుడిని పట్టించిన ఆ ట్యాగ్ ఏంటి..?
ఏపీ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన మద్యాన్ని సీజ్ చేసిన ఎస్ ఈ బీ అధికారులు.. నిందొతుడి కోసం కూపీ లాగారు. ట్రంకుపెట్టెలు చూస్తే కేంద్రబలగాలు వినియోగించేవి. కానీ అందులో ఉణ్డేవి అక్రమ మద్యం. దీంతో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించారు ఎస్ ఈ బీ అధికారులు. మద్యం బాటిళ్ళను వెరిఫై చేశారు. దిల్లీ నుంచి తెస్తున్నట్టు గుర్తించారు. మరి నిందితుడెవరు..? కూపీ లాగేసరికి దీంతో చిన్న క్లూ లభించింది. ట్రంకు పెట్టెలపై ఎయిరిండియా ఫ్లైట్ పాసింజర్ ట్యాగ్ కనిపించింది. అదే నిందితుడుని పట్టుంచిణ్ది. సిహెచ్ గౌరీశంకర్ అని పేరు ఉణ్డడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు. విశాఖకో సీఐఎస్ ఎఫ్ అధికారులతో మాట్లాడారు. దీంతో.. స్టీల్ ప్లాంట్ లో గౌరీ శంకర్ పేరుతో పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత ఏమీ ఎరగనట్టు బుకాయిణ్చినా.. ఆ తరువాత నిజం ఒప్పుకున్నాడు.
మరి రైల్లో అధికారుల నుంచి సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ ఎలా తప్పుంచుకున్నాడు. దీనిపై కూపీ లాగేసరికి మరో షాక్..! వీడి ఎంవో తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు. విశాఖ నుంచి ట్రంకు పెట్టెలతీ దర్జాగా ఫ్లైట్ ఎక్కే గౌరీ శంకర్.. నేరుగా దిల్లీలో దిగిపోతున్నాడు. అక్కడ రమేష్ అనే వ్యక్తికి పెట్టెలను అప్పగించి.. మూడో కంటికి తెలియకుండా గౌరీశంకర్ ఫ్లైట్లో వచ్చి విశాఖలో వాలిపోతున్నాడు. ఆ తరువాత మద్యాన్ని ఆ పెట్టెల్లో పెట్టి రైల్లో విశాఖ చేరేలా ప్లాన్ చెస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుందా ఆ ట్రంకుపెట్టెలపై బాంబ్ స్క్వాడ్ ఎక్యూప్ మెంట్ అని ముద్రవేసి జాగ్రత్తపడుతున్నాడు. రైల్లో ఎంచక్కా విశాఖ వరకు వచ్చేసరికి దువ్వాడలో గానీ, అనకాపల్లిలో గానీ ఆ బాక్సులను పికప్ చేదుకుంటున్నాడు సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గౌరీశంకర్.
దిల్లీ బదర్ పూర్ నుంచి ఎవరికీ అనుమానం రాకుండా విశాఖ వరకు తెచ్చేస్తున్న మద్యాన్ని.. సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ అమ్మేస్తున్నాడు. డిఫెన్స్ లో పనిచేస్తున్న సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ కావడంతో డిఫెన్స్ మద్యమని జనాలకు నమ్మించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు.. చాకా సార్లు ఈ మద్యాన్ని దిల్లీ నుంచి తీసుకొచ్చి విశాఖ లో అమ్మినట్టు అధికారుల విచారణలో తేలింది. అయితే.. డిఫెన్స్ మద్యమని బాటిళ్ళపై ముద్ర ఉన్నప్పటికీ అది కల్తీ మద్యమని అధికారులు అనుమానిస్తున్నారు. సీల్, ప్రిఖ్ట్ తో పాటు బాటిల్ మూత ఒరిజినల్ కు పోలి లేకపోవడంతో కచ్చితంగా నకిలీ మద్యం అయివుంటుణ్దని అణ్టున్నారు అధికారులు. కల్తీ మద్యాన్నే డిఫెన్స్ మద్యంగా అమ్మి సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించారు అధికారులు. 143 బాటిళ్ళను సీజ్ చేసి ల్యాబ్ కు పంపిస్తున్నారు.
ఇదీ.. లిక్కర్ స్మగ్లర్ గా మారిన సీఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ వ్యవహారం. గౌరీశంకర్ ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టిన ఎస్ ఈ బీ అధికారులు.. దీని వెనుక ఉన్న లింకులపై కూపీ లాగుతున్నారు. ఓ బాధ్యతగల ఉద్యోగంలో ఉంటూ ఇలా దో నెంబర్ దందా చేస్తుండడంతో అధికారులు విస్మయానికి గుర్యయారు.
Read also: Parents committee elections: ఏపీలో రియల్ పాలిటిక్స్‌ని బీట్ చేసిన పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్..!